తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వలేదని చంపి.. ముక్కలుగా కోసి వాటిని..
- January 24, 2019
తీసుకున్న డబ్బులో కొంత చెల్లించేసాడు. మిగిలిన డబ్బు నిదానంగా చెల్లిస్తానన్నాడు. దాంతో కోపం కట్టలు తెంచుకుంది. అందే బిల్డింగ్ పై నుంచి తోసేసి చంపేశాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన ముంబైలోని శాంటాక్రూజ్‌లో జరిగింది. పింటూ శర్మ, గణేష్ కొల్హాద్కర్ ఇద్దరూ స్నేహితులు. గణేష్ వ్యక్తిగత అవసరాల రిత్యా పింటూ దగ్గర లక్షరూపాయలు అప్పుగా తీసుకున్నాడు.
కొద్ది రోజుల తరువాత 40 వేలు అప్పు కింద జమ కట్టుకోమని ఇచ్చాడు. మిగిలిన 60 వేల బాకీని త్వరలో తీర్చేస్తానన్నాడు. ఎన్ని రోజులైనా మిగిలిన అప్పు మాట ఎత్తట్లేదు. తనకీ ఖర్చులు ఉన్నాయని చెప్పినా తీర్చేస్తానంటున్నాడే కాని నయా పైసా చెల్లించలేదు. దాంతో గణేష్ పట్ల కోపంగా ఉన్నాడు పింటూ.
ఇదిలా ఉండగా ఓ రోజు కలిసి మద్యం తాగుదాం అని పింటూ గణేష్‌ని పిలిచాడు. ఇద్దరూ పీకలదాకా మద్యం సేవించారు. ఆ మత్తులోనే అప్పు గురించి ఎత్తాడు పింటూ. దాని గురించి గొడవకు కూడా దిగారు ఇద్దరూ. ఈ క్రమంలోనే గణేష్‌ని పింటూ మేడపై నుంచి కిందికి తోసేసాడు. రెండో అంతస్తు నుంచి కింద పడ్డ గణేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. వెంటనే బాడీని తీసుకుని బాత్రూంలోకి వెళ్లి 200 ముక్కలుగా నరికాడు.
వాటిని టాయ్లెట్లో పడేసి నాలుగు రోజుల పాటు అందులో నీళ్లు పోస్తూనే ఉన్నాడు. మున్సిపల్ కార్మికులు డ్రైనేజీ శుభ్రపరుస్తుండగా మృతదేహం ముక్కలు కనిపించాయి. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితుడు పింటూను అరెస్టు చేశారు.
తాజా వార్తలు
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్‌లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం







