70వ భారత రిపబ్లిక్ వేడుకల్ని నిర్వహించిన ఇండియన్ ఎంబసీ
- January 29, 2019
మస్కట్: ఇండియన్ ఎంబసీ, 70వ భారత రిపబ్లిక్ దినోత్సవ వేడుకల్ని ఎంబసీ కార్యాలయంలో నిర్వహించింది. ఎంబసీ అధికార ప్రతినిథి మాట్లాడుతూ, జనవరి 26 ఉదయం 8.30 నిమిషాలకు ఎంబసీ పరిసరాల్లో ఈ కార్యక్రమం జరిగిందని తెలిపారు. అల్ ఖువైర్‌లోని అల్ దోవాల్ అల్ అరేబియా స్ట్రీట్‌లోగల డిప్లమాటిక్ ఏరియాలో ఈ వేడుకల్ని నిర్వహించారు. ఒమన్‌లో భారత రాయబారి అయిన మను మహావర్, జాఈయ పతాకావిష్కరణ చేశారు. 450 మంది అతిథులకు రిసెప్షన్ కూడా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మినిస్టర్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫిషరీస్ డాక్టర్ ఫైద్ బిన్ జాఫర్ బిన్ మొహమ్మద్ అల్ సజ్వాని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఒమన్‌లో స్థిరపడ్డ భారత కళాకారులు పలు ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్‌లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్‌లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







