మార్చిలో ‘సీతారామరాజు - ఎ ట్రూ వారియర్’ ప్రారంభం
- January 29, 2019
మన్యంలో బ్రిటీష్ వారి దురాగతాలకు నిరసనగా విప్లవ బావుటా ఎగురవేసిన పాతికేళ్ల కుర్రాడు అల్లూరి సీతారామరాజు జీవిత గాథను ‘సీతారామరాజు’ పేరుతో తెరకెక్కించనున్నారు. ‘ఎ ట్రూ వారియర్’ అనే ట్యాగ్‌లైన్‌తో ఈ చిత్రం తెరకెక్కనుంది. సొంతూరు, గంగపుత్రులు, గల్ఫ్ వంటి సామాజిక చిత్రాలను తెరకెక్కించిన పి. సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో.. డా. శ్రీనివాస్ నిర్మాణ సారథ్యంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. మార్చిలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ చిత్రాన్ని ఆగస్టులో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా చిత్ర దర్శక నిర్మాతలు మాట్లాడుతూ.... 'అప్పటి చరిత్రతో ఇప్పటి యువతకి స్ఫూర్తి నింపేలా అల్లూరి సీతారామరాజు త్యాగం ఆయన కీర్తిని మరింత ఇనుమడింపజేసే దిశగా ‘‘సీతారామరాజ’ - ఏ ట్రూ వారియర్ చిత్రాన్ని రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్‌లోనే తొలిసారిగా పూర్తి పోస్ట్ ప్రొడక్షన్ వసతులతో స్టూడియో ఏర్పాటు చేసిన రిసాలి ఫిల్మ్ స్టూడియో అండ్ అకాడమీ బ్యానర్‌పై ఈ చిత్ర నిర్మాణం జరుగుతుంది. విశాఖ, కాకినాడ, రాజమండ్రి, ఏజెన్సీ ల పరిసర ప్రాంతాల్లో సింహ భాగం షూటింగ్ జరుపుకునే ఈ చిత్రానికి సీనియర్ సాంకేతిక నిపుణుల బృందం పనిచేస్తుంది.
నూతన నటీనటులతో పాటు సీనియర్ నటీనటులు కూడా ఇందులో నటిస్తారు. మార్చిలో షూటింగ్ ప్రారంభమౌతున్న ఈ చిత్రాన్నిఆగస్టులో విడుదల చేయడానికి ప్రయత్నిస్తున్నాం. అల్లూరి సీతారామరాజు చేసిన సాయుధ పోరాట నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో ఉన్న గ్రాఫిక్స్ వర్క్‌కు సంబంధించిన సీజీ వర్క్ ఇప్పటికే జరుగుతోంది. చరిత్రకారుల సహకారంతో సీతారామరాజు మరణానికి సంబంధించిన మిస్టరీని కూడా ఈ చిత్రంలో చూపించనున్నాం. త్వరలో సాంకేతిక నిపుణులు, నటీనటుల పూర్తి వివరాలు తెలియజేస్తాం’ అని తెలిపారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!