మెసేజ్‌లన్నీ కంపెనీ సర్వర్ నుంచి చదివిన యాజమాన్యం.. పదేళ్ల జైలు శిక్ష.. భారీ లక్షల జరిమానా
- January 29, 2019
సౌదీ అరేబియా:అన్ని జబ్బులకు ఒకటే వైద్యం పనికిరాదన్నట్లు.. మనం చేస్తున్న ఉద్యోగం.. ఉంటున్న స్థలం వంటి వివరాలను దృష్టిలో పెట్టుకుని.. అంతకు మించి ఒళ్లు దగ్గర పెట్టుకుని పని చేయాలన్న విషయం ఈ వార్త చదివితే అర్థమవుతుంది. కేరళకు చెందిన విష్ణుదేవ్ అనే 28 ఏళ్ల వ్యక్తి సౌదీ అరేబియాలో ఓ ఆయిల్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.
కళ్ల ముందు కంప్యూటర్ ఉంది కదా అని సోషల్ మీడియా ద్వారా లండన్‌లో ఉంటున్న ఓ ముస్లిం అమ్మాయితో పరిచయం పెంచుకున్నాడు. ఆమెతో చాటింగ్ చేస్తూ సంభాషణలు పొడిగించేవాడు. ఒక రోజు ఆమె హిందూ దేవుళ్లను, భారతీయ సంప్రదాయాలను తిడుతూ మెసేజ్ పెట్టింది.
అవి చూసిన విష్ణూకి కోపం కట్టలు తెంచుకుంది. వెంటనే ముస్లిం ప్రవక్తకు సంబంధించి కొన్ని ప్రశ్నలను ఆమెను అడిగాడు. ఈ మెసేజ్‌లు అన్నీ కంపెనీ సర్వర్నుంచి వెళ్లడంతో వాటన్నింటినీ చదివిన కంపెనీ యాజమాన్యం స్క్రీన్ షాట్లు తీసి అతన్ని బంధించింది. కొద్ది రోజుల్లో విష్ణు కేరళకు వెళతాడని తెలుసుకుని పోలీసులకు సమాచారం అందించింది.
దైవదూషణకు పాల్పడినందుకు గాను అతడికి పదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.28 లక్షల జరిమానా విధించింది సౌదీ హైకోర్టు. కాగా, విష్ణుకు పెళ్లయి ఓ పాప కూడా ఉంది. విష్ణు తండ్రి రాధాకృష్ణ నాయర్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేసారు. సౌదీలోని విదేశాంగ శాఖతో కొడుకు విడుదల గురించి మాట్లాడినా ఉపయోగం లేకుండా పోయింది.
కేరళ ఎంపీ శశిథరూర్ ద్వారా ప్రయత్నించినా ఫలించలేదు. రమదాన్ పర్వదినాన క్షమాభిక్ష పిటిషన్ ద్వారా అయిన తన కొడుకు వస్తాడేమోనని రాధాకృష్ణ ఆశగా ఎదురు చూస్తున్నారు. సౌదీలో శిక్షలు ఎంత కఠినంగా ఉంటాయో ఇప్పటికైనా అర్థమయ్యే ఉంటుంది ప్రతి ఒక్కరికీ.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..