గంభీర్: ప్రపంచకప్ జట్టు ఇదే
- January 30, 2019
ఇంగ్లండ్ వేదికగా 2019 ప్రపంచకప్ మే 30 నుంచి ప్రారంభం కానుంది. ఈ టైటిల్ నిలబెట్టుకోవాలని ప్రతి ఒక్క జట్టు ఇప్పటినుండే సిద్ధమవుతోంది. ఈ ప్రపంచకప్‌లో టీమిండియా ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది. దీంతో టీమిండియాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ అంచనాలను అందుకునేలా భారత జట్టు కూడా ఎప్పటినుంచో కసరత్తు చేస్తోంది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ లో ప్రయోగాలు చేస్తూ ఆటగాళ్లను పరీక్షిస్తోంది. అయితే ప్రపంచకప్‌లో ఆడే ఆటగాళ్లు కొందరు ఖాయంగా కనిపిస్తోన్నా.. ఆటగాళ్ల ఫామ్, గాయాల కారణంగా ప్రపంచకప్ ఆరంభం వరకు ఎవరు జట్టులో ఉంటారనేది అనుమానంగా మారింది.
ఈ నేపథ్యంలో 2019 ప్రపంచకప్‌లో పాల్గొనే భారత జట్టుని మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ప్రకటించాడు. మొత్తం 15 మందితో కూడిన తన కలల జట్టుని ప్రకటించాడు. ఆశ్చర్యంగా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు జట్టులో చోటు కల్పించాడు. అయితే రవీంద్ర జడేజా, యువరాజ్ సింగ్, ఉమేశ్ యాదవ్ వంటి సీనియర్లకు చోటు లభించలేదు. యువ ఆటగాడు రిషభ్ పంత్‌ను కూడా తన కలల జట్టులో చోటు ఇవ్వలేదు. హార్థిక్ పాండ్యా, కేఎల్ రాహుల్‌లకు జట్టులో అవకాశమిచ్చాడు. మరో వికెట్ కీపర్ గా దినేష్ కార్తీక్ కు చోటిచ్చాడు. నిజానికి ఒకటి, రెండు మార్పులు తప్ప ఇదే జట్టు కొనసాగే అవకాశం ఉంది.
గంభీర్ కలల జట్టు:
రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనీ, అంబటి రాయుడు, కేదార్ జాదవ్, దినేశ్ కార్తీక్, హార్థిక్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ షమీ, రవిచంద్రన్ అశ్విన్, యజువేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్.
తాజా వార్తలు
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!