హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ ను ప్రారంభించిన ఇస్రో!
- January 31, 2019
2021లో మానవసహిత అంతరిక్ష యాత్ర 'గగన్ యాన్'ను చేపడతామని ఇస్రో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ముగ్గురు వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపుతామని అప్పట్లో చెప్పింది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం రూ.10,000 కోట్ల బడ్జెట్ ను కేటాయించింది. తాజాగా ఈ ప్రాజెక్టులో భాగంగా బెంగళూరులోని ఇస్రో ప్రధాన కార్యాలయం ప్రాంగణంలో ఏర్పాటుచేసిన 'హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్'ను ఇస్రో మాజీ చైర్మన్ కస్తూరిరంగన్ ప్రారంభించారు. మానవసహిత యాత్రకు వెళ్లే వ్యోమగాములు ఇక్కడే శిక్షణ పొందనున్నారు. మరోవైపు వ్యోమగాములు అంతరిక్షంలోకి వెళ్లేందుకు అవసరమైన మాడ్యుల్ ను సైతం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలను ఇస్రో ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..