జంతువులకి సాయం కోసం బహ్రెయిన్‌ పాలిటెక్నిక్‌ డొనేషన్‌ క్యాంప్‌

- January 31, 2019 , by Maagulf
జంతువులకి సాయం కోసం బహ్రెయిన్‌ పాలిటెక్నిక్‌ డొనేషన్‌ క్యాంప్‌

బహ్రెయిన్‌ పాలిటెక్నిక్‌ - కమర్షియల్‌ అండ్‌ కూమ్యూనిటీ ఇనీషియేటివ్‌, నాన్‌ - మానెటరీ డొనేషన్‌ డ్రైవ్‌ని స్టూడెంట్‌ కౌన్సిల్‌ మరియు వాలంటీర్‌ క్లబ్‌ సహాయంతో నిర్వహిస్తోంది. బహ్రెయిన్‌ సొసైటీ ఫర్‌ ది ప్రివెన్షన్‌ ఆఫ్‌ క్రూయెల్టీ టు యానిమల్స్‌ (బిఎస్‌పిసిఎ) షెల్టర్‌లో వున్న డాగ్స్‌ మరియు క్యాట్స్‌కి సాయం చేసేందుకే ఈ డ్రైవ్‌ నిర్వహించారు. డ్రై మరియు వెట్‌ ఫుడ్‌, క్యాట్‌ లిట్టర్‌, డిస్‌ఇన్‌ఫెక్టెంట్స్‌, బ్లీచ్‌లను సేకరించారు నిర్వాహకులు. క్యాంపస్‌ వ్యాప్తంగా ఏర్పాటు చేసిన బాక్స్‌లలో స్టూడెంట్స్‌ మరియు స్టాఫ్‌ డొనేట్‌ చేసిన ఈ ఐటమ్స్‌ షెల్టర్‌లో వున్న జంతువులకు ఉపకరిస్తాయి. కమ్యూనిటీ మరియు కమర్షియల్‌ ఇనీషియేటివ్స్‌ హెడ్‌ ఫాయెబింట్‌ ఖలీఫా అల్‌ ఖలీఫా మాట్లాడుతూ, బహ్రెయిన్‌ పాలిటెక్నిక్‌, యానిమల్‌ వెల్ఫేర్‌ సెంటర్స్‌ కోసం తాము నిర్వహించిన రెండో డొనేషన్‌ క్యాంప్‌ ఇదని తెలిపారు.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com