అమెరికాలో ఆలయంపై దుండగుల దాడి

- January 31, 2019 , by Maagulf
అమెరికాలో ఆలయంపై దుండగుల దాడి

వాషింగ్టన్‌: అమెరికాలో లూయిస్‌విలెలో ఉన్న స్వామినారాయణ్‌ ఆలయంపై ఆదివారం రాత్రి గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. ఆలయంలో ఉన్న దేవుడి విగ్రహానికి నల్ల రంగు పూశారు. కిటికీలను విరగ్గొట్టారు. అక్కడే ఉన్న కుర్చీకి ఓ కత్తిని గుచ్చి వెళ్లిపోయారు. ఈదాడితో అక్కడ ఉన్న భారతీయులను షాక్‌కు గురిచేసింది. అమెరికా అధికారులు దీనిపై విచారణ మొదలుపెట్టారు. ఈ దాడిని తీవ్రంగా ఖండించారు లూయిస్‌విలె మేయర్ గ్రెట్ ఫిషర్. ఈ విద్వేషం లేదా మత దురభిమానాన్ని మనం తీవ్రంగా వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. ఇది పిరికిపందల చర్య అని ఫిషర్ అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com