అత్యవసరం

- December 26, 2015 , by Maagulf


వేడి సెగల మధ్యలో ఇరుక్కొని
తడారిన గొంతుతో 
నిన్ను ఆశ్రయం అర్థించినప్పుడు 
నీ పచ్చని చేతుల్లో సేద దీర్చి 
చనుబాల లాంటి నీ మధుర ఫలాల
రసాలు మాకు పట్టించి 
మారిన కాల గమనపు విష వాయువుల
మధ్య ఊపిరి ఆడక కొట్టుకు చస్తున్నప్పుడు 
మాకు సహజ వాయువు ప్రసాదించి 
మా ఆగిన శ్వాసను అతికించు నువ్వు
అవసరానికి ఆవలి తీరం చేర్చి నువ్వు 
నీ ఎముకలతో నీటిలో తేలి సర్వ విధాలా 
మాకు జీవన భృతి కలిగించే 
వృక్ష రాజానివి జగద్రక్ష అయిన నువ్వు 
చిరిగిన మా పర్యావరణం సాక్షిగా మాకు 
అత్యవసర శ్వాసవి కావాలిప్పుడు ......


--జయ రెడ్డి బోడ(అబుధాబి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com