జైలు లో 90 మంది భారతీయులు మరో 193 మందికి దేశ బహిష్కరణ
- December 26, 2015
భారత దౌత్య కార్యాలయంలోని లేబర్ మరియు కమ్యునిటీ వెల్ఫేర్ విభాగం తమకు 4080 పిర్యాదులు అందినట్లు కమ్యునిటీ హౌస్ తెలిపింది. గత ఏడాది 3943 పిర్యాదులు వచ్చాయని పేర్కొన్నారు. కేంద్ర కారాగారంలో90 మంది భారతీయులు జైలుశిక్ష అనుభవిస్తున్నారు. మరో 193 మంది దేశ బహిష్కరణ గురై స్వదేశంకు వెళ్ళడానికి టికెట్ల కోసం వేచియున్నట్లు తెలిపారు. అలాగే , ఖతర్ లో 2014 లో 279 మంది, 2015 లో ఇప్పటి వరుకు 275 మంది భారతీయులు మరణించినట్లు సమాచారం. ఈ ఏడాది డిసెంబర్ లోపు 15 మంది చనిపోయినట్లు భారత దౌత్య కార్యాలయం వివరాలను అందిస్తుంది. బహిష్కరణ గురైన భారత జాతీయులకు ప్రయాణ పత్రాలు కోసం ఖతర్ అధికారులను భారత దౌత్య కార్యాలయం అభ్యర్దించగా, డిసెంబర్ 19 వ తేదీన రాయబార కార్యాలయం ఎమర్జెన్సీ సర్టిఫికేట్ ను జారీ చేసింది. అలాగే, 9 మంది భారతీయులకు విమాన టికెట్లను సైతం ఏర్పాటు చేసింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







