తెలంగాణ:ఇకపై బర్త్ సర్టిఫికెట్...
- January 31, 2019
తెలంగాణ:దేశంలో ఎక్కడా లేని విధంగా జనన ధ్రువీకరణ పత్రాలను దరఖాస్తు దారులే నేరుగా ఆన్‌లైన్ ద్వారా గానీ లేదా డెలివరీ అయిన హాస్పిటల్ నుంచి కూడా పొందవచ్చని తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. నిన్న మొన్నటి వరకు బర్త్‌సర్టిఫికెట్ కోసం సర్కిల్ మున్సిపల్ కార్యాలయం చుట్టూ తిరగాల్సి వచ్చేది. లేదా మీ సేవా కేంద్రానికి వెళ్లి తీసుకోవాల్సి వచ్చేది.
ఈ క్రమంలో సదరు అయ్యవార్లకు ఎంతో కొంత సమర్పించుకోవాల్సి వచ్చేది. దాదాపు రూ.2 వేల నుంచి రూ. 3 వేల వరకు వసూలు చేసేవారు. పిల్లలను స్కూల్లో జాయిన్ చేయాలంటే తప్పనిసరిగా జనన ధ్రువీకరణ పత్రం కావాలి. అందుకోసం ఎన్ని ఇబ్బందులైనా పడి పత్రాన్ని తీసుకునేవారు తల్లిదండ్రులు.
ఈ విషయం సర్కార్ దృష్టికి రావడంతో ఈ-బర్త్ విధానం ద్వారా ఇక నుంచి ఈజీగా సర్టిఫికెట్ పొందవచ్చని తెలిపింది. ఈ విధానం ద్వారా ధ్రువీకరణ పత్రాలను సులభంగా పొందడమే కాకుండా రాష్ట్రంలో రోజువారీ జన్మిస్తున్న శిశువుల లెక్క కూడా పక్కాగా ఉంటుందని తెలిపారు.
ఈ-బర్త్ విధానం ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ప్రవేటు ఆసుపత్రులలో కూడా అమలు చేస్తున్నట్లు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు డా. వెంకటి, డా. స్వరాజ్యలక్ష్మిలు తెలిపారు. ప్రజలే నేరుగా తమ పిల్లల జనన ధ్రువీకరణ పత్రాలను నేరుగా ఆన్‌లైన్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
అయితే ఈ సంవత్సరం నుంచే అమలులోకి వచ్చింది కావునా 2019, జనవరి 1 నుంచి జన్మించిన వారి సర్టిఫికెట్లను మాత్రమే పొందడానికి వీలుంటుంది. వెబ్‌సైట్: ebirth.telangana.gov.in లోకి వెళ్లి అక్కడ అడిగిన వివరాలతో పాటు సంబంధిత ఆసుపత్రి సిబ్బంది డెలివరీ షీట్‌లో జారీ చేసిన యూనిక్ ఐడీకోడ్‌ను ఎంటర్ చేయాలి.
వెబ్‌సైట్‌లో ఎంటర్ చేసిన వివరాల ఆధారంగా సంబంధిత శిశువు జనన ధృవీకరణ పత్రం వస్తుంది. దీనిని నేరుగా ఇంట్లో సిస్టమ్ ఉంటే కూడా డౌన్‌లోడ్ చేసుకుని ఫ్రింట్ తీసుకోవచ్చు. మీ పిల్లలకు ఏ పేరైతే పెట్టారో అది కూడా మీరే ఎంటర్ చేసి సర్టిఫికెట్ తీసుకోవచ్చు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







