అమెరికాలోని తెలుగు విద్యార్థులకు సాయం చేస్తాం:రవికుమార్ వేమూరు
- January 31, 2019
అమరావతి: అమెరికాలో చదువుతున్న తెలుగు విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన పనిలేదని ఏపీ ఎన్‌ఆర్టీ అధ్యక్షుడు రవికుమార్ వేమూరు స్పష్టం చేశారు. తెలుగు విద్యార్థులను అరెస్టు చేస్తున్నారని వస్తున్న వార్తల నేపథ్యంలో ఆయన స్పందించారు. ఉన్నత చదువులు పూర్తి చేసిన విద్యార్థులు అక్కడి నుంచి రావడం ఇష్టం లేక కొన్ని గుర్తింపు లేని యూనివర్సిటీల్లో చదువుతున్నట్లు నకిలీ పత్రాలు సృష్టిస్తున్నారని, అలాంటి వారిని కట్టడి చేసేందుకు అమెరికా ప్రభుత్వం ఏటా రహస్య దర్యాప్తు చేపడుతోందన్నారు. ఆ దర్యాప్తులో భాగంగా 8 మంది తెలుగు విద్యార్థులు... ఇతర విద్యార్థులను నకిలీ యూనివర్సిటీల్లో చేర్పిస్తున్నట్లు అమెరికా ఆరోపిస్తుందన్నారు. అయితే, అందులో నిజానిజాలు తెలియాల్సి ఉందన్నారు. ఏపీ ఎన్‌ఆర్టీ తరఫున అమెరికాలోని తెలుగు విద్యార్థులకు సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. తమ హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫోన్ చేస్తే కావాల్సిన సమాచారం అందిస్తామని వెల్లడించారు.
తెలుగు విద్యార్థులు విదేశాలకు వెళ్లేముందు అక్కడి చట్టాలను క్షుణ్నంగా తెలుసుకోవాలని, లేదంటే చిక్కుల్లో పడాల్సి వస్తుందని ఏపీ ఎన్‌ఆర్టీ సీఈవో కొడాలి భవానీశంకర్ అన్నారు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







