శిల్పారామం వద్ద ఫీడ్‌ ది నీడ్‌ కేంద్రాన్ని ప్రారంభించిన GHMC మేయర్‌

- February 01, 2019 , by Maagulf
శిల్పారామం వద్ద ఫీడ్‌ ది నీడ్‌ కేంద్రాన్ని ప్రారంభించిన GHMC మేయర్‌

హైదరాబాద్:నిరుపేదల ఆకలి తీర్చేలా మరో వినూత్న కార్యక్రమానికి జీహెచ్‌ఎంసీ శ్రీకారం చుట్టింది. రూ.5కే భోజనం అందిస్తూ అన్నపూర్ణ కేంద్రాలను ఏర్పాటుచేసిన సంస్థ... పైసా ఖర్చు లేకుండా కడుపు నింపుకునే సదవకాశాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. సంస్థ తరపున పైసా ఖర్చు చేయకుండా.. నిరుపేదలు రూపాయి వెచ్చించాల్సిన అవసరం లేకుండా పౌర భాగస్వామ్యంతో ఫీడ్‌ ది నీడ్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. శిల్పారామం వద్ద ఫీడ్‌ ది నీడ్‌ కంటెయినర్‌ను గురువారం స్థానిక ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, జోనల్‌ కమిషనర్‌ హరిచందనతో కలిసి మేయర్‌ బొంతు రామ్మోహన్‌ ప్రారంభించారు.


ఇళ్లలో మిగిలిన ఆహార పదార్థాలను నిల్వ చేసేందుకు వీలుగా కంటెయినర్‌(పెద్ద రిఫ్రిజిరేటర్‌)ను ఏర్పాటు చేశారు. నగరవ్యాప్తంగా ఫీడ్‌ ది నీడ్‌ కేంద్రాలను విస్తరించనున్నట్టు రామ్మోహన్‌ తెలిపారు. పెళ్లిళ్లు, ఫంక్షన్లు, ఇతర సందర్భాలు, హోటళ్లు, ఇళ్లలో మిగిలిన ఆహార పదార్థాలను అన్నార్థుల ఆకలి తీర్చేందుకు వీలుగా ఫీడ్‌ ది నీడ్‌ కేంద్రాల్లోని కంటెయినర్లలో నిల్వ చేయాలని నగరవాసులను కోరారు. సామాజిక బాధ్యతగా ఈ కేంద్రాల నిర్వహణను ప్రైవేట్‌ సంస్థకు అప్పగించారు. మిగిలిన ఆహార పదార్థాలను ఈ కంటెయినర్లలో నిల్వ చేస్తే.. అవసరార్ధులు ఉచితంగా తీసుకొని తినొచ్చు. ఈ సందర్భంగా రూ.3 కోట్ల వ్యయంతో కొనుగోలు చేసిన ఎనిమిది ఎయిర్‌టెక్‌, జెట్టింగ్‌ యంత్రాలను మేయర్‌ ప్రారంభించారు. అంతకుముందు నల్లగండ్ల నుంచి గోపన్‌పల్లి మీదుగా వట్టినాగులపల్లి ఔటర్‌ రింగ్‌ రోడ్డు వరకు 9 కి.మీల విస్తీర్ణంలో రూ.150 కోట్ల వ్యయంతో చేపట్టే రేడియల్‌ రోడ్‌ నెంబర్‌-30 పనులను రామ్మోహన్‌ పరిశీలించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com