సౌదీ అరేబియాలో ఫిలిప్పీన్స్ మహిళకు ఉరి
- February 01, 2019
సౌదీ అరేబియా: సౌదీలో ఫిలిప్పీన్స్ మహిళకు ఉరిశిక్ష విధించారు. 2015లో జరిగిన ఓ హత్య కేసులో ఆమెపై మోపిన అభియోగాలు రుజువయ్యాయి. దీంతో, అధికారులు ఆమెను ఉరితీశారు. వివరాల్లోకి వెళ్లితే ...ఫిలిపినా(39) (పేరు మార్చబడింది) అనే మహిళ ఓ ఇంట్లో పనిచేసేది. ఆమె తన యజమానురాలిని అత్యంత కిరాతకంగా హత్యచేసింది. తానే ఈ హత్యకు పాల్పడినట్టు విచారణలో అంగీకరించింది. ఫిలిపినాకు ఉరిశిక్ష విధించబోయే సమాచారాన్ని ఫిలిప్పీన్స్ విదేశాంగ శాఖకు ఒక రోజు ముందుగా తెలిపినట్టు సౌదీ ప్రకటించింది. కాగా, అరబ్ కింగ్‌డమ్‌లోని దేశాలు గతేడాది 143 మందిని ఉరితీసినట్టు యూరోపియన్ సౌదీ ఆర్గనైజేషన్ ఫర్ హ్యూమన్ రైట్స్ సంస్థ పేర్కొంది. ఉరిశిక్షల అమలులో సౌదీ 5వ స్థానంలో ఉందని తెలిపింది. సౌదీలో దాదాపు 10లక్షల మంది ఫిలిప్పీన్స్‌కు చెందిన పౌరులు పనిచేస్తున్నారని తెలిపింది. అయితే, హత్య, లైంగికదాడి, మారణాయుధాలతో దాడి వంటి కేసులను సౌదీ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి మరణదండన విధిస్తుందని ఆ సంస్థ తెలిపింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..