ముఖ్యమంత్రిగా బాలకృష్ణ..
- February 01, 2019
దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన వినయ విధేయ రామ చిత్రం నిరాశపరిచింది. సంక్రాంతికి విడుదలైన వినయ విధేయ రామ చిత్రం రాంచరణ్ అభిమానులని ఆకట్టుకోలేక పోయింది. ఇక బోయపాటి తన తదుపరి చిత్రాలపై దృష్టి పెట్టాడు. బాలయ్యతో హ్యాట్రిక్ మూవీకి సిద్ధం అవుతున్నట్లు బోయపాటి శ్రీను గతంలోనే ప్రకటించాడు. బాలయ్య, బోయపాటి కాంబోలో వచ్చిన సింహా, లెజెండ్ రెండు చిత్రాలు ఘన విజయం సాధించాయి. తాజాగా హ్యాట్రిక్ మూవీ గురించి ఆసక్తికర వార్తలు వస్తున్నాయి.
ఈ నెలలోనే
ఈ నెలలోనే ప్రారంభం
బోయపాటి శ్రీను ప్రస్తుతం బాలయ్య చిత్ర కథపై కసరత్తు పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఈ చిత్రం ఈ నెలలోనే ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. లెజెండ్, సింహ చిత్రాలని మించే రేంజ్ లో బోయపాటి శ్రీను ఈ చిత్ర కథని పవర్ ఫుల్ గా తీర్చిదిద్దుతున్నట్లు తెలుస్తోంది. నందమూరి అభిమానులంతా బాలయ్య, బోయపాటి చిత్రం కోసం ఇప్పటి నుంచే ఎదురుచూస్తున్నారు.
ముఖ్యమంత్రి పాత్రలో
ఈ చిత్ర కథ గురించి ఆసక్తికర వార్తలు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నాయి. సింహా, లెజెండ్ చిత్రాల్లో బాలయ్య ద్విపాత్రాభినయం చేశారు. ఈ చిత్రంలో కూడా బాలకృష్ణ డ్యూయెల్ రోల్ లో కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఓ పాత్రలో బాలయ్య ముఖ్యమంత్రిగా కనిపిస్తాడని అంటున్నారు. ముఖ్యమంత్రిగా బాలయ్య నిర్ణయాలు ఆశ్చర్యాన్ని కలిగించే విధంగా ఉంటాయని.. ఆ తరహాలో బోయపాటి కథ సిద్ధం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..