ఫిబ్రవరి 22న 'ప్రేమెంత పనిచేసె నారాయణ'
- February 02, 2019
హరికృష్ణ జొన్నలగడ్డ, అక్షిత జంటగా నటిస్తోన్న రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ప్రేమెంత పనిచేసె నారాయణ'. భాగ్యలక్ష్మి సమర్పణలో జె.ఎస్. ఆర్ మూవీస్ పతాకంపై సావిత్రి జొన్నలగడ్డ ఈ సినిమానునిర్మిస్తున్నారు. నాగార్జున హీరోగా ఎదురులేని మనిషి సినిమాతో డైరెక్టర్ మంచి గుర్తింపు తెచ్చుకున్న జొన్నలగడ్డ శ్రీనివాసరావు ఈ సినిమాకు దర్శకుడు.
అన్ని పనులు పూర్తి చేసుకుని ఈ సినిమాను ఫిబ్రవరి 22న రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు చిత్రయూనిట్. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు జొన్నలగడ్డ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. 'సినీ పరిశ్రమలో 30 ఏళ్ల నుంచి ఉంటున్నాను. చాలా మంది పెద్ద హీరోల సినిమాలకు పనిచేసాను. దర్శకుడిగా నాకిది తొమ్మిదవ సినిమా. కథ వైవిధ్యంగా ఉందనే నా కుమారుడిని ఈ సినిమా తో హీరోగా పరిచయం చేస్తున్నా. రెగ్యులర్ లవ్ స్టోరీలకు భిన్నంగా ఉంటుంది. క్లైమాక్స్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. ఇండస్ట్రీ పెద్దల సహకారం, సూచనలతో ఫిబ్రవరి 22వ తేదిన రిలీజ్ డేట్ గా ఫిక్స్ చేసాం. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే సినిమా ఇది' అని అన్నారు.
హీరో హరికృష్ణ మాట్లాడుతూ, 'అన్నీ జనరేషన్లకు కనెక్ట్ అయ్యే ప్రేమకథా చిత్రమిది. సినిమా చూస్తే ఓ కొత్త కథను చూస్తున్నామనే అనుభూతి కలుగుతుంది. సినిమా చాలా బాగా వచ్చింది. మా సినిమాకు మీడియా కూడా మంచి పబ్లిసీటీ ఇచ్చింది. తప్పకుండా విజయం సాధిస్తాం' అన్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..