కేలిఫోర్నియా: గాలిలో పేలిన విమానం, ఐదుగురి మృతి

- February 05, 2019 , by Maagulf
కేలిఫోర్నియా: గాలిలో పేలిన విమానం, ఐదుగురి మృతి

కేలిఫోర్నియా: కేలిఫోర్నియాలో ఆదివారం ఒక విమానం గాలిలోనే పేలిపోయిన ఘటనలో దాని శకలాలు ఒక ఇంటిపై పడి ఐదుగురు దుర్మరణం పాలయ్యారని, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారని అధికారులు చెప్పారు. ఇంటి వెనుకభాగంలో కూలిపోయిన ఈ రెండు ఇంజన్ల విమానం మంటల్లో చిక్కుకుని పూర్తిగా దగ్ధమైందని వివరించారు. విమానం పైలట్‌తో సహా ఇంటిలో వున్న నలుగురు వ్యక్తులు మంటల్లో చిక్కుకుని మరణించినట్లు కాలిఫోర్నియాలోని ఆరంజ్‌ కౌంటీ షరీఫ్‌ లెఫ్టినెంట్‌ కోరి మార్టినో చెప్పారు. ఇంటిలో మంటల్లో చిక్కుకుని మరణించిన నలుగురిలో ఇద్దరు పురుషుల వున్నారని అధికారులు తెలిపారు. సెస్నా 414ఎ తరహా విమానం ఘటనా స్థలానికి కొంత దూరంలో టేకాఫ్‌ అయిన కొద్ది నిముషాలకు ప్రమాదంలో చిక్కుకున్నదని ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌ ప్రతినిధి అలెన్‌ కెనిట్జర్‌ వివరించారు. ఈ ఘటనతో భయకంపితులైన ఇరుగుపొరుగు వారు వీధుల్లోకి పరుగులు తీసారని ఆయన చెప్పారు. విమానంలో ఒక ఇంజన్‌ భవనాన్ని ఢకొీనగా, రెండో ఇంజన్‌ విమానం నుండి విడిపోయి ఒక రోడ్డుపై పడటంతో అక్కడ భారీ గొయ్యి ఏర్పడిందని జాతీయ రవాణా భద్రతా వ్యవస్థ ప్రతినిధి ఇలియాట్‌ సింప్సన్‌ చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com