డిగ్రీ అర్హతతో ఐసిఐసిఐ బ్యాంకులో ప్రొబెషనరీ ఆఫీసర్ పోస్టులు..
- February 05, 2019
ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ ప్రొబెషనరీ ఆఫీసర్స్ (పీవో) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. దరఖాస్తుల నుంచి షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులను మాత్రమే సెలక్షన్ ప్రాసెస్‌కు అనుమతి ఇస్తారు. వారికి ఆప్టిట్యూడ్ పరీక్ష నిర్వహించి అందులో పాసైన వారికి మణిపాల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో నిర్వహించనున్న పీజీ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ (పీజీడీబీ) కోర్సులో ప్రవేశం కల్పిస్తారు. కోర్సు పూర్తయిన తరువాత ప్రొబెషనరీ ఆఫీసర్లుగా ఉద్యోగావకాశాలు కల్పిస్తారు. శిక్షణ కాలంలో స్టయిఫండ్ ఇస్తూ కోర్ బ్యాంకింగ్‌పై పరిజ్ఞానాన్ని, స్కిల్స్‌ను కల్పిస్తారు. ప్రధానంగా బ్యాంకింగ్ ప్రొడక్ట్స్, బ్యాంకింగ్ ఆపరేషన్స్, చానెల్స్ అండ్ కస్టమర్స్, రిసిప్ట్, పేమెంట్స్ తదితరాలపై శిక్షణ ఉంటుంది. అదేవిధంగా అభ్యర్థులు స్పెషలైజేషన్స్ సబ్జెక్టులుగా, ట్రేడ్ ఫైనాన్స్, ప్రివిలేజ్ బ్యాంకింగ్, రూరల్ ఇన్‌క్లూజివ్ బ్యాంకింగ్, రిటైల్ బ్యాంకింగ్ అంశాల్లో ఏదో ఒకటి ఎంచుకోవాల్సి ఉంటుంది.
పోస్టు: ప్రొబెషనరీ ఆఫీసర్
అర్హత: కనీసం 55 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 25 సంవత్సరాలకు మించకూడదు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
ఎంపిక విధానం: ఆన్‌లైన్ ఆప్టిట్యూడ్ టెస్ట్, ఆన్‌లైన్ సైకోమెట్రిక్ అసెస్‌మెంట్, కేస్‌బేస్డ్ గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ వీటన్నింటిలో కనబర్చిన ప్రతిభ ఆధారంగా మెరిట్ లిస్ట్‌ను తయారు చేసి అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పరీక్ష కోసం స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.
కోర్సు వివరాలు..
ఏడాదిపాటు సాగే పీజీడీబీ కోర్సును నాలుగు టర్మ్‌లుగా విభజించారు. టర్మ్‌ల వారీగా క్లాస్ రూమ్ శిక్షణతోపాటు, ఇంటర్న్‌షిప్, ఉద్యోగ శిక్షణ ఉంటుంది. ఇది పూర్తిగా ఏడాది రెసిడెన్షియల్ ప్రోగ్రాం. ఇంటర్న్‌షిప్ కాలంలో కూడా క్యాంపస్‌లో ఉండాల్సి ఉంటుంది.
టర్మ్-1లో నాలుగు నెలలు బెంగళూరులోని ఐఎంఏలో క్లాస్‌రూం శిక్షణ ఇస్తారు.
టర్మ్-2లో రెండు నెలలు ఐసీఐసీఐ బ్యాంక్‌లో ఇంటర్న్‌షిప్ ఉంటుంది.
టర్మ్-3లో రెండు నెలలు బెంగళూరులోని ఐఎంఏలో క్లాస్‌రూం శిక్షణ ఇస్తారు.
టర్మ్-4లో నాలుగు నెలల పాటు ఐసీఐసీఐ బ్యాంక్‌లో ఉద్యోగ శిక్షణ ఉంటుంది.
కోర్సు ఫీజు ట్యాక్స్‌లు అన్నీ కలుపుకుని మొత్తం రూ.3,88,500 అవుతుంది. దీనిలో 3.15 లక్షలను లోన్ రూపంలో బ్యాంకు అందిస్తుంది.
శిక్షణను విజయవంతంగా పూర్తిచేసుకున్న అభ్యర్థులకు డిప్యూటీ మేనేజర్ ర్యాంక్‌లో ఐసీఐసీఐ బ్యాంక్‌లో పోస్టును ఇస్తారు. బ్యాంక్‌లో జాయిన్ అయిన తరువాత లోన్ ఈఎంఐలు ప్రారంభమవుతాయి. 60 నెలల కాలంలో లోన్‌ను తీర్చే అవకాశం కల్పిస్తారు.
తాజా వార్తలు
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్‌లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్







