వీధి కుక్క దాడి: బాలుడికి గాయాలు
- February 05, 2019
బహ్రెయిన్: సనాబిస్ ప్రాంతంలో ఓ బాలుడిపై స్ట్రే డాగ్ దాడి చేసింది. ఈ దాడిలో బాలుడికి గాయలయ్యాయి. తన స్నేహితులతో కలిసి ఇంటి బయట ఆ బాలుడు ఆడుకుంటుండగా ఈ ఘటన జరిగింది. కుక్కల మంద ఒకటి బాలుడిపై దాడి చేసినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. బాలుడిపై కుక్కల దాడి అనంతరం గాయపడ్డ బాలుడ్ని వెంటనే సల్మానియా మెడికల్ కాంప్లెక్స్‌కి తరలించారు. ఈ ప్రాంతంలో స్ట్రే డాగ్స్ సమస్య తీవ్రంగా వుందంటూ పలుమార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని రెసిడెంట్స్ అంటున్నారు. అయితే యానిమల్ లవర్స్ మాత్రం, స్ట్రే డాగ్స్‌కి వ్యతిరేకంగా రెసిడెంట్స్ మాట్లాడడం సబబు కాదనీ, తగు జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి ప్రమాదాలు జరగవని అంటున్నారు. స్ట్రే డాగ్స్ పట్ల అప్రమత్తంగా వుండాలనీ, అదే సమయంలో వాటి పట్ల జాలి చూపించాలని చెబుతున్నారు యానిమల్ లవర్స్.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







