దుబాయ్‌ స్కూల్స్‌లో ఇండియన్స్‌ స్టూడెంట్స్‌ 'హ్యాపీయెస్ట్‌'

- February 05, 2019 , by Maagulf
దుబాయ్‌ స్కూల్స్‌లో ఇండియన్స్‌ స్టూడెంట్స్‌ 'హ్యాపీయెస్ట్‌'

దుబాయ్‌ స్కూల్స్‌లో ఇండియన్‌ స్టూడెంట్స్‌కి 'హ్యాపీయెస్ట్‌' ఇండెక్స్‌లో చోటు దక్కింది. అరబ్స్‌ని హయ్యస్ట్‌ పెర్‌సెవరెన్స్‌ కేటగిరీలోనూ, వెస్టర్న్‌ పీపుల్‌ని లీస్ట్‌ వర్రీయ్‌డ్‌గానూ పేర్కొన్నారు. దుబాయ్‌ ఎడ్యుకేషన్‌ రెగ్యులేటర్‌ వెల్‌ బీయింగ్‌ సర్వేలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. 2018 దుబాయ్‌ స్టూడెంట్‌ వెల్‌ బీయింగ్‌ సెన్సస్‌ - నాలెడ్జ్‌ అండ్‌ హ్యూమన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఈ నివేదికను 'వాట్‌ వర్క్స్‌ కాన్ఫరెన్స్‌'లో విఉడదల చేసింది. మొత్తం 95,875 మంది విద్యార్థుల్ని ఇందుకోసం సర్వే చేశారు. గ్రేడ్‌ 6 నుంచి 12 వరకు 181 ప్రైవేట్‌ స్కూల్స్‌ నుంచి శాంపిల్స్‌ తీసుకున్నారు. 81 శాతం మంది స్టూడెంట్స్‌ ఈ ఇండెక్స్‌లో 'హ్యాపీ' విభాగంలో చోటు దక్కించుకున్నారు. వీరిలో ఇండియన్స్‌ అత్యధికులు వున్నారు. కాగా, 66 శాతం సీనియర్‌ స్టూడెంట్స్‌ ఎలక్ట్రానిక్‌ డివైజ్‌లను నిద్రపోయేముందు వినియోగిస్తున్నట్లు తేలింది. 89 శాతం మంది ప్రశాంతమైన నిద్రను పొందుతున్నామని చెప్పారు. 84 శాతం మంది ఫ్రూట్స్‌, వెజిటబుల్స్‌ తీసుకుంటున్నట్లు వివరించారు. రిలేషన్‌షిప్స్‌ కేటగిరీలో 54 శాతం మంది తమకంటే పెద్దవారితో సంబంధాలు కలిగి వున్నట్లు చెప్పారు. 
 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com