సంకటంగా మారిన సోషల్ మీడియా...సౌదీ జైల్లో మగ్గుతున్న నిజామాబాద్ యువకుడు
- February 06, 2019
నిజామాబాద్ : సోషల్ మీడియా తెచ్చిపెట్టిన చిక్కులతో తెలంగాణకు చెందిన యువకుడు విదేశీ జైల్లో మగ్గుతున్నాడు. తెలిసి తెలియక చేసిన తప్పుకు కారాగార శిక్ష అనుభవిస్తున్నాడు. ఉపాధి నిమిత్తం విదేశాల బాట పట్టిన సదరు యువకుడు సౌదీలో బందీగా మారాడు. అరచేతిలో ప్రపంచం చూసిన అతడు.. చెరసాలలో చిక్కుకున్నాడు.
పోస్టింగ్‌తో జైలుశిక్ష..సోషల్ మీడియా ఎఫెక్ట్
నిజామాబాద్ జిల్లాకు చెందిన యువకుడు.. సోషల్ మీడియా కారణంగా దేశం కాని దేశంలో జైలు జీవితం గడుపుతున్నాడు. పెర్కిట్ గ్రామానికి చెందిన చెన్న రాకేశ్ 2017లో ట్విట్టర్ వేదికగా పెట్టిన ఓ పోస్టు అతడికి శిక్ష పడేలా చేసింది. మయన్మార్ లో రోహింగ్యాలపై దమనకాండను సమర్థిస్తూ ట్విట్టర్ లో పోస్టు పెట్టాడు. అయితే అతడు ట్వీట్ చేసిన కొద్దిసేపటికే చాలా ప్రాంతాల నుంచి అతన్ని సమర్థిస్తూ కొందరు రీట్వీట్ చేశారు. ఇదంతా కూడా వివాదస్పదంగా మారింది. ఓ వర్గం వారు ఆ ట్వీట్లకు సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోస్టు తొలగించినప్పటికీ..!
కొందరి ఫిర్యాదు మేరకు అక్కడి పోలీసులు రాకేశ్ ను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసును విచారించిన అక్కడి కోర్టు రాకేశ్‌కు ఐదేళ్ల జైలుశిక్ష విధించింది. ప్రస్తుతం అతడు రియాద్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. 2017లో రాకేశ్ ఆ పోస్టు పెట్టినప్పటికీ.. కొద్దిసేపటి తర్వాత ఆయన రియలైజ్ అయి ట్విట్టర్ నుంచి దాన్ని తొలగించారు. కానీ అది అప్పటికే వైరల్ గా మారిందనే కారణంతో పోలీసులు కేసు బుక్ చేశారు.
హైకోర్టులో అప్పీలుకు అవకాశం..సాయం కోసం ఎదురుచూపు
గల్ఫ్ చట్టాల ప్రకారం సోషల్ మీడియాలో షేర్ చేసినవాళ్లు.. తెలియకుండా చేశామని తప్పు ఒప్పుకుంటే స్వల్ప శిక్షతో బయటపడే ఛాన్సుంది. అదే వివాదస్పద పోస్టులు పెట్టినవారు మాత్రం మూల్యం చెల్లించుకోక తప్పదు. రాకేశ్ విషయంలో సరిగ్గా అదే జరిగింది. ట్విట్టర్ లో వివాదస్పద పోస్ట్ పెట్టారనే కారణంగా అక్కడి పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఉన్నత న్యాయస్థానంలో అప్పీలు చేసుకునేందుకు గడువు సమీపిస్తుండటంతో రాకేశ్ విషయం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో రాకేశ్ కు సహకరించాలంటూ అతడి కుటుంబ సభ్యులు అభ్యర్థిస్తున్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..