మర్‌గబ్‌బ్‌ మనీ ఎక్స్‌ఛేంజ్‌లో దోపిడీ

- February 07, 2019 , by Maagulf
మర్‌గబ్‌బ్‌ మనీ ఎక్స్‌ఛేంజ్‌లో దోపిడీ

కువైట్‌ సిటీ: మర్‌గబ్‌లోని ఓ మనీ ఎక్స్‌ఛేంజ్‌ కార్యాలయంలో దోపిడీకి సంబంధించి నిందితుల్ని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. నిందితులు 11,000 కువైటీ దినార్స్‌ని 'సేఫ్‌' నుంచి దోచుకెళ్ళినట్లు తెలుస్తోంది. మరో 'సేఫ్‌'ని కూడా తెరిచేందుకు ప్రయత్నించిన నిందితులు ఆ క్రమంలో విఫలమవడంతో దొరికిన సొమ్ముతోనే పారిపోయారు. సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా నిందితుల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు అధికారులు. క్రిమినల్‌ ఎవిడెన్సెస్‌ డిపార్ట్‌మెంట్‌, సంఘటనా స్థలంలోని ఫింగర్‌ ప్రింట్స్‌ని సేకరించడం జరిగింది. వాటి ఆధారంగా నేరం నిరూపితం కాబోతోంది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com