రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు మందు ఫ్రీ..అది కూడా దుబాయ్ లో!
- February 07, 2019అక్కడ చట్టాలు కఠినంగా ఉంటాయి కానీ క్లబ్‌లు మాత్రం కొంచెం వెసులు బాటుగా ఉంటాయి. ముఖ్యంగా మహిళల కోసం లేడీస్ క్లబ్‌లు వందల సంఖ్యలో ఉంటాయి దుబాయ్ నగరంలో. అందులో వారికి ప్రత్యేక సౌకర్యాలు కూడా ఉంటాయి.
తెల్లవారు జామున వారిని ఇంటి దగ్గర కూడా డ్రాప్ చేసే సౌకర్యం కూడా ఉంటుంది. అయితే ఇక్కడ పాపం పురుషులకి అన్యాయం జరిగిపోతోంది. వారికి ఆఫర్లు ఉండవు, సౌకర్యాలు ఉండవు. అందుకే ఓ రెస్టారెంట్ వారి బాధను అర్థం చేసుకుని ఓ వినూత్న కార్యక్రమానికి తెరలేపింది.
రాత్రి పూట రెండు గంటల పాటు మగమహారాజులకి మందు ఫ్రీ అని ప్రకటించింది. అనుకున్నదే తడవుగా ఓ బోర్డుని సిద్దం చేసి క్లబ్ ముందు పెట్టేసింది. పెగ్గు ఫ్రీగా ఇస్తూ ఫుడ్డుకి మాత్రం 50 శాతం డిస్కౌంట్ అందిస్తోంది. దుబాయిలోని 'ఆసియా ద క్యూబా' అనే రెస్టారెంట్ ప్రవేశ పెట్టిన ఈ ఆఫర్లపై దుబాయి నైట్ క్లబ్‌ల్లో విపరీతంగా చర్చ జరుగుతోంది.
మరి ఈ ఆఫర్ ఫిబ్రవరి 19 నుంచి 'వెస్టిన్ దుబాయ్ మైనా సెయాహీ బీచ్ రిసార్ట్'లో ఈ ఆఫర్ అందుబాటులో ఉండనుంది. ప్రతి మంగళవారం ఇక్కడ క్లబ్ నిర్వహణ జరుగుతుంది. రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు పురుషులకు ఉచితంగా డ్రింకులను అందుబాటులో ఉంచుతారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ