అనారోగ్యంతో ఆస్నత్రిలో చేరిన సోను నిగమ్
- February 07, 2019
ఆరోగ్యమే మహాభాగ్యమని తెలిసొచ్చిందని చెబుతున్నారు బాలీవుడ్ స్టార్ సింగర్ సోను నిగమ్. దేనితో పెట్టుకున్నా.. ఎలర్జీతో మాత్రం పెట్టుకోవద్దని చెబుతున్నారు. మీ హెల్త్ కు పడని వస్తువులు తిని… నాలా బాధపడొద్దని సూచిస్తున్నాడు. ఒరిస్సాలో ఓ ప్రోగ్రామ్ చేసేందుకు వెళ్లిన సోను నిగమ్… సీ ఫుడ్ చూసి టెంప్ట్ అయ్యాడట. సీ ఫుడ్ అలర్జీ ఉందని తెలిసినా… టేస్టీగా ఉండడంతో ఫుల్ గా తినేశాడట. దీంతో వెంటనే అలర్జీ అందుకుంది. కళ్లు, ముక్కు స్వెలింగ్ వచ్చింది. అది కాస్త శృతి మించడంతో… ముంబైలోని నానావతి హాస్పిటల్ లో చేరాడు సోను. కొద్దిగా ఆలస్యం అయితే శ్వాసనాళానికి స్వెలింగ్ వచ్చి… శ్వాస తీసుకోవడం కష్టంగా మారి చాలా ఇబ్బంది తలెత్తేదని చెప్పాడు. థ్యాంక్ గాడ్.. మీ ప్రేమ, ఆశీర్వాదాల వల్ల ప్రస్తుతం బాగానే ఉన్నానన్న సోనూ నిగమ్… మీరు ఇలాంటి ఛాన్స్ తీసుకోవద్దన్నారు. హ్యాపీ హెల్దీ లైఫ్ టు ఎవిరీ వన్ అని విష్ చేశాడు. దీనిపై స్పందించిన ఫ్యాన్స్… సోనూ నిన్ను ఇలా చూడడం చాలా బాధగా ఉంది… గెట్ వెల్ సూన్ అని చెబుతున్నారు.
తాజా వార్తలు
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!