కొత్త ట్రాఫిక్ అప్డేట్స్ కోసం బహ్రెయిన్ సిద్ధం
- February 08, 2019మినిస్ట్రీ ఆఫ్ వర్క్స్, మునిసిపల్ ఎఫైర్స్ మరియు అర్బన్ ప్లానింగ్ - రోడ్ ప్లానింగ్ మరియు డిజైన్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ ఎం కజెమ్ అబ్దుల్ లతీఫ్ మాట్లాడుతూ, మినిస్ట్రీ - జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్‌తో కలిసి ట్రాఫిక్ లైట్ సిగ్నల్స్ సిస్టమ్‌ని మరింత అభివృద్ధి చేసే విషయమై చర్చలు జరుపుతోందని అన్నారు. గ్రీన్ లైట్ ఫ్లాషింగ్ని కింగ్‌డమ్‌లోని రోడ్లపై అమలు చేయడం ఈ కొత్త సిస్టమ్ తాలూకు ఉద్దేశ్యం. గ్రీన్ నుంచి రెడ్ లైట్ వైపు మారే క్రమంలో 3 సెకెన్లపాటు ఫ్లాష్ చేస్తారు కొత్త విధానంలో. ఫిబ్రవరి 8 నుంచి దీన్ని లాంఛ్ చేస్తున్నారు. రెడ్ సిగ్నల్ పడే ముందు డ్రైవర్లను అప్రమత్తం చేయడానికి ఈ ఫ్లాస్ విధానం ఉపయోగపడ్తుంది. అల్ ఫతెహ్ హైవే, షేక్ దాయిజ్ అవెన్యూ వద్ద అలాగే వాడి అల్ అహా రోడ్ మరియు మిలిటరీ హాస్పిటల్ ఎంట్రన్స్ వద్ద ప్రయోగాత్మకంగా వీటిని తొలుత ప్రవేశపెడుతున్నారు.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్‌లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్‌లు