ఏటీఎం కార్డుల బ్లాక్‌: బ్యాంకుల హెచ్చరిక

- February 08, 2019 , by Maagulf
ఏటీఎం కార్డుల బ్లాక్‌: బ్యాంకుల హెచ్చరిక

యూఏఈలో బ్యాంకులు తమ వినియోగదారుల్ని ఎమిరేట్స్‌ ఐడీని రెన్యూ చేసుకోవాల్సిందిగా సూచిస్తున్నాయి. ఫిబ్రవరి 15 లోగా అప్‌డేట్‌ చేసుకోని పక్షంలో వారి ఏటీఎం కార్డులు తాత్కాలికంగా పనిచేయడం మానేస్తాయి. ఆటోమేటిక్‌ పేమెంట్లు, క్రెడిట్‌ కార్డులు సైతం ఆగిపోయే అవకాశాలుంటాయి. ఈ నిర్నయం యూఏఈలోని ఫైనాన్స్‌ కంపెనీలకూ వర్తిస్తాయి. అయితే బ్యాంక్‌ టెల్లర్‌ సర్వసులు, కస్టమర్‌ సర్వీస్‌ సెంటర్స్‌ మీద మాత్రం ఈ ప్రభావం వుండదు. ఈ సమయంలో ఎలాంటి అదనపు ఛార్జీలు, కండిషన్స్‌, జరీమానాలు వుండబోవు. క్లయింట్స్‌ బ్యాంకు వెబ్‌సైట్‌ని సందర్శించడం, బ్యాంక్‌కి ఐడీ ఫొటో కాపీని ఇ-మెయిల్‌ చేయడం, మొబైల్‌ బ్యాంకింగ్‌ వినియోగించడం, ఏటీఎం మెషీన్ల ద్వారా అప్‌డేట్‌ చేసుకోవడం, కస్టమర్‌ సర్వీస్‌ సెంటర్స్‌ని ఆశ్రయించడం ద్వారా తమ డిటెయిల్స్‌ని అప్‌డేట్‌ చేసుకోవచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com