వారితో ప్రేమలో పడ్డ విజయ్ దేవరకొండ
- February 09, 2019
విజయ్ దేవరకొండ ప్రేమలో పడ్డాడట. అయితే ఆయన గర్ల్‌ఫ్రెండ్ ఎవరు.. ఏంటి.. అనుకుంటున్నారా? ఇద్దరు క్యూట్ చిన్నారులు. ఇటీవల విజయ్ దేవరకొండ కాకినాడలో 'డియర్ కామ్రేడ్' షూటింగ్లో ఉండగా గాయపడిన విషయం తెలిసిందే. ఈ ఘటన సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. తమ తండ్రి ఫోనులో దీనిని చూసిన ఇద్దరు చిన్న పాపల్లో ఒకరు 'నాన్నా విజయ్ కొండకు ఏమైంది?' అని ప్రశ్నించగా.. 'విజయ్ కొండకు దెబ్బతాకిందటమ్మా' అని తండ్రి చెప్పాడు.
అప్పుడు ఆ చిన్నారి 'పెద్దదా?' అని ప్రశ్నించగా.. తండ్రి ఆ వీడియో చూపించు నాకు అని అడుగుతాడు. అప్పుడు ఆ వీడియో చూపించిన ఆ చిన్ని పాప వచ్చీ రాని మాటల్లో.. 'ఏం చేద్దాం' అని అడగ్గా.. డాక్టర్ దగ్గరకు వెళ్లమని చెప్పమంటాడు తండ్రి. వెంటనే మరోపాప 'విజయ్ దేవరకొండ డాక్టర్ దగ్గరకు వెళ్లు' అని ముద్దుముద్దుగా చెబుతుంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
ఈ వీడియోను చూసిన విజయ్.. 'నేను ఇప్పుడే ప్రేమలో పడ్డాను. విజయ్ కొండకు డాక్టర్ అవసరం లేదు. కానీ మీ ఇద్దరినీ కలవాలనుకుంటున్నాడు.
కలుస్తారా?' అని ప్రశ్నించాడు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..