‘యాత్ర’ సినిమా పై దర్సకేంద్రుడి స్పందన
- February 13, 2019దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయా జీవితంలో భాగమైన పాదయాత్ర ఆధారంగా తెరకెక్కిన సినిమా ‘యాత్ర’ ఈ నెల 8న విడుదలైన ఈ చిత్రం భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. ఈ సినిమాకు వైసీపీ కార్యకర్తలు బ్రహ్మరధం పట్టారు. కాగా ‘యాత్ర’ దర్శకేంద్రుడు రాఘవేందర్ రావు తిలకించారు. అనంతరం ఈ సినిమాపై తన పేస్ బుక్ ద్వారా అభిప్రాయాన్ని వెల్లడించారు. ‘యాత్ర చూసాను. దర్శకుడు మహి, రాజశేఖర్ రెడ్డి గారి పాదయాత్రతో పాటు ఆయన ఆశయాల్ని కూడా అద్భుతంగా తెరకేక్కించాడు. మమ్ముట్టి ఆయన పాత్రలో జీవించారు.
నిర్మాతలు విజయ్ మరియు శశి కి, వారి చిత్ర యూనిట్ కి నా కృతజ్ఞతలు..’ అంటూ పోస్ట్ చేశారు. దీంతో దర్శకుడు మహి వి రాఘవ ఆయనకు ధన్యవాదాలు తెలుపుతూ.. ఆనందంగా మీరు దీన్ని ఇష్టపడ్డారు అని పేర్కొన్నారు. సూపర్‌స్టార్ మమ్ముట్టి హీరోగా మహి.వి.రాఘవ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు.
తాజా వార్తలు
- కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- 110 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి..పోలీసులకు చిక్కాడు..
- మోడీ మూడోసారి ప్రధాని కాబోతున్నారు: చంద్రబాబు
- ఢిల్లీ లోని నాలుగు ఆస్పత్రులకు బాంబు బెదిరింపులు
- వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ నామినేషన్ కార్యక్రమం..
- ముంబై: హోర్డింగ్ కూలిన ఘటనలో పెరిగిన మృతుల సంఖ్య
- యూఏఈలో CBSE రిజల్ట్స్.. ఎదురైన లాగిన్ సమస్యలు..!
- మక్కాలో ముగ్గురు మోసగాళ్ళు అరెస్ట్
- ఆన్లైన్ బెదిరింపులా? సైబర్ క్రైమ్ ఫిర్యాదు ఇలా చేయండి
- అడ్వెంచర్ టూరిజానికి కేరాఫ్ రుస్తాక్ వైల్డ్ లైఫ్ రిజర్వ్