టీవీ నటి ఝాన్సీ ఆత్మహత్యకు కారణం తేల్చిన పోలీసులు
- February 13, 2019
ప్రేమించిన వ్యక్తి కోసం సర్వస్వం వదులుకుంది. అతనే ప్రాణం అనుకుంది. అతన్ని పెళ్లి చేసుకునేందుకు బంగారం లాంటి భవిష్యత్తును త్యాగం చేసింది. నటించటం మానేసి..బ్యూటీపార్లర్ పెట్టుకుంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ప్రియుడు మాత్రం అదిగో ఇదిగో అంటూ హ్యాండ్ ఇచ్చాడు. చివరి ఆమె ఆత్మహత్యకు కారణమయ్యాడు. మర్డర్ చేయకపోయిన ఆమెను మానసికంగా హిసించి హత్య చేసినంతపని చేశాడు.
టీవీ నటి ఝాన్సీ ఆత్మహత్య కేసులో వెలుగులోకి వచ్చిన వాస్తవాలు ఇవి. ఫోన్ కాల్స్, వాట్సాప్ చాటింగ్, వీడియోలను పరిశీలించిన పోలీసులు…ఝాన్సీ ఆత్మహత్యకు సూర్య కారణమని తేల్చారు. ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆ తర్వాత ఆమెను ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేయటంతోనే ఝాన్సీ ఆత్మహత్య చేసుకుందని పోలీసుల దర్యాప్తులో నిర్ధారణ అయింది. దీంతో అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.
సూర్య విజయవాడలో మొబైల్ స్టోర్ నిర్వహించేవాడు. పోయినేడాది స్నేహితుల ద్వారా నాగఝాన్సీతో పరిచయం ఏర్పడింది. పరిచయం ప్రేమగా మారింది. ఒకరినొకరు పెళ్లి చేసుకోవాలనుకున్నారు. దీంతో సూర్యకు డబ్బు సాయంతో పాటు బైక్ కూడా కొనిచ్చింది. జనవరి 27 నాగఝాన్సీ ఇంటికి వెళ్లిన సూర్య..పెళ్లి నిర్ణయాన్ని ఆమె కుటుంబసభ్యులకు చెప్పాడు. అయితే..తన తల్లిదండ్రలను ఒప్పించాలంటే ఝాన్సీ నటన మానుకోవాలని షరతు పెట్టాడు సూర్య. పెళ్లి కోసం ఆమె నటనను వదిలేసి బ్యూటీ పార్లర్ పెట్టుకుంది. అయితే..తరచు అనుమానించడం వలెనే ఆమె ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.
తాజా వార్తలు
- అమెరికాలో నలుగురు భారత సంతతి వ్యక్తుల హత్య
- కువైట్ లో ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు
- బహ్రెయిన్ లో రోడ్డు ప్రమాదం..చిన్నారి సహా ముగ్గురు మృతి..!!
- చలి కుంపట్ల పై కువైట్ ఫైర్ ఫోర్స్ వార్నింగ్..!!
- గ్లోబల్ ఫాస్టెస్ట్ మొబైల్ ఇంటర్నెట్ సిటీగా దోహా..!!
- సౌదీయేతరుల కోసం 170 జోన్లు కేటాయింపు..!!
- దుబాయ్లో ట్రక్ డీజిల్ చోరీ..ఇద్దరు వ్యక్తులకు జైలుశిక్ష..!!
- ఒమన్ లో ఇండియన్ వెస్ట్రన్ నావల్ కమాండ్ కమాండర్..!!
- NRI టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో నారా లోకేష్ జన్మదిన వేడుకలు
- Google 2026 Internship:యువత కోసం గోల్డెన్ ఛాన్స్







