దుబాయ్ ఎయిర్‌పోర్టుల్లో వికలాంగులకు ప్రత్యేక కౌంటర్లు
- December 27, 2015
జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్నీ అండ్ ఫారినర్స్ ఎఫైర్స్ దుబాయ్ (జిడిఆర్ఎఫ్ఎ - దుబాయ్) మిడిల్ ఈస్ట్‌లోనూ, ప్రపంచంలోనూ తొలసారిగా వికలాంగులకు ప్రత్యేక సౌకర్యాలు అందించనున్నట్లు వెల్లడించింది. డైరెక్టర్ జనరల్ జిడిఆర్ఎఫ్-దుబాయ్ మేజర్ జనరల్ మహమ్మద్ అహ్మద్ అల్ మర్రి మాట్లాడుతూ, దుబాయ్ వికలాంగులకు ఏ్నహపూర్వకమైన సిటీగా 2020 నాటికి అవతరించనుందని, ఆ దిశగా అడుగులు వేస్తున్నామని అన్నారు. అల్ మర్రి మాట్లాడుతూ, వికలాంగులకు ఎయిర్‌పోర్టుల్లో ఇబ్బందులు సర్వసాధారణమనీ, అయితే జిడిఆర్ఎఫ్ఎ-దుబాయ్ వికలాంగుల కోసం ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసిందని చెప్పారు. ప్రతి టెర్మినల్‌లోనూ స్పెషల్ కౌంటర్లను ఎరైవల్, డిపాచ్యుర్లో ఏర్పాటు చేశామన్నారు. కౌంటర్లు వికలాంగులకు వీలుగా ఉండేలా తగినంత వెడల్పుతో, ఎత్తుతో రూపొందించామన్నారు. కేవలం 18 సెకన్లలో వికలాంగులు తమ ప్రాసెస్‌ని పూర్తి చేసుకోవచ్చని చెప్పారాయన. అలాగే, వికలాంగులైన ప్రయాణీకులకు అన్ని రకాలుగా సహాయపడేందుకు సిబ్బందిని కూడా నియమించారు. దీనికోసం 20 మంది శిక్షణ పొందిన అధికారుల్ని వినియోగిస్తున్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







