హైదరాబాద్ లో 7 గల్ఫ్ మెడికల్ చెకప్ సెంటర్లు
- February 13, 2019
గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జీసీసీ) దేశాలయిన సౌదీ అరేబియా, యూఏఈ (యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్), ఓమాన్, బహ్రెయిన్, ఖతార్, కువైట్ లతోపాటు యెమెన్‌కు కొత్తగా ఉద్యోగానికి/నివాసానికి వెళ్లాలనుకునే వారు ముందస్తు ఆరోగ్య పరీక్షలు (ప్రీ హెల్త్ చెకప్ - మెడికల్ ఎగ్జామినేషన్) చేయించుకొని మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్ పొందాలి. ఇందుకోసం 'గల్ఫ్ హెల్త్ కౌన్సెల్' వెబ్ సైటు https://gcchmc.org/Gcc/Home.aspx ద్వారా ఆన్ లైన్‌లో అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవాలి. గల్ఫ్ దేశాలకు వెళ్లేవారికి అంటువ్యాధులు ఏమైనా ఉన్నాయా ? ఎయిడ్స్, టీబీ వంటి వ్యాధులు ఉన్నాయా ? వారు ఆరోగ్యంగా ధృడంగా ఉన్నారా..? అని ఇక్కడ పరీక్ష చేసి మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్ ఇస్తారు. ఆరోగ్యవంతులకు మాత్రమే అరబ్ గల్ఫ్ దేశాలకు వెళ్లేందుకు వీసా జారీ అవుతుంది.
'గల్ఫ్ హెల్త్ కౌన్సిల్' వారు భారత దేశంలోని 17 నగరాలలో 114 మెడికల్ డయాగ్నోస్టిక్ సెంటర్లకు అనుమతి ఇచ్చారు. మంగుళూరు (4), అహ్మదాబాద్ (4), బెంగుళూరు (5), లక్నో (12), ముంబై (19), చెన్నై (7), ఢిల్లీ (13), హైదరాబాద్ (7), జైపూర్ (5), తిరువనంతపురం (5), తిరుచ్చి (5), కాలికట్ (5), మంజేరి (4), తిరూర్ (4), కొచ్చి (5), గోవా (3), కోల్‌కతా (7) మెడికల్ డయాగ్నోస్టిక్ సెంటర్లు ఉన్నాయి.
తాజా వార్తలు
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్‌లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం







