ఆకట్టుకునే మోడి చిత్రాలతో చీరలు
- February 14, 2019
సూరత్: రాబోయే లోక్‌కసభ ఎన్నికల ప్రచారం కోసం పార్టీలు ఓటర్లను ఆకర్షించేందుకు వినూత్న ప్రచారంతో ముందుకు వెళ్లాలని ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నారు. అయితే అన్ని రాజకీయ పార్టీల కంటే ముందు బిజెపి ప్రచారంలో దూసుకెళ్లేతుంది. ఇప్పటికే నమోగ టీషర్ట్లు, నమోగ కుర్తీలతో ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్న కమలం పార్టీ.. ఇప్పుడు నమోగ చీరలతో మహిళలను ఆకట్టుకోవాలని యోచిస్తోంది. సూరత్‌కు చెందిన ఓ వస్త్ర వ్యాపారికి 5 లక్షల నమో చీరలు కావాలంటూ ఆర్డర్ ఇచ్చింది. అందమైన ఎంబ్రాయిడరీతో ఆకట్టుకునే మోదీ చిత్రాన్ని ఈ చీరలపై తీర్చిదిద్దారు. మోదీని సింహం, చిరుత పులితో పోలుస్తూ తయారు చేసిన ఈ చీరలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. స్వచ్ఛభారత్, నోట్ల రద్దుతోపాటు మోదీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేసిన సంక్షేమ పథకాలను చీరపై ముద్రించారు. సబ్ కా సాత్.. సబ్ కా వికాస్, నమో ఎగైన్ మిషన్2019 నినాదాలను చీరలపై రాశారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..