వర్క్‌ ప్లేస్‌లో బలవన్మరణానికి పాల్పడ్డ వలసదారుడు

- February 14, 2019 , by Maagulf
వర్క్‌ ప్లేస్‌లో బలవన్మరణానికి పాల్పడ్డ వలసదారుడు

భారతీయ వలసదారుడొకరు మాల్కియాలోని వర్క్‌ ప్లేస్‌లో బలవన్మరణానికి పాల్పడ్డారు. మృతుడ్ని 48 ఏళ్ళ రామ్‌ ప్రతాప్‌ సింగ్‌గా గుర్తించారు. భారతదేశంలోని ఉత్తరప్రదేశ్‌ నుంచి వచ్చినట్లుగా అతని గురించిన వివరాల్ని అధికారులు పేర్కొన్నారు. మృతుడికి భార్య అనితా సింగ్‌, ముగ్గురు పిల్లలు వున్నారు. ఓ ప్రైవేటు కాంట్రాక్టింగ్‌ కంపెనీలో మృతుడు వర్క్‌ సూపర్‌ వైజర్‌గా పనిచేస్తున్నారు. ముహరాక్‌లో నివసిస్తున్న సింగ్‌ తన కుమార్తెల్ని ఇంటి వద్ద వదలి, రాత్రి సమయంలో ఈ దారుణానికి పాల్పడ్డారు. తన తండ్రి ఆచూకీ కోసం ఆయన కుమార్తెలు సాక్షి, శ్రేయ సింగ్‌ ప్రయత్నించగా, కో-వర్కర్‌, రామ్‌ ప్రతాప్‌ సింగ్‌ మృతి విషయాన్ని వెల్లడించారు. సాక్షి, శ్రేయ, ఇండియన్‌ స్కూల్‌ బహ్రెయిన్‌లో విద్యనభ్యసిస్తున్నారు. రామ్‌ ప్రతాప్‌ సింగ్‌ కుమారుడు క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. భారతదేశంలో చికిత్స పొందుతున్న ఆ కుర్రాడికి సహాయంగా అతని తల్లి ఇండియాలోనే వుంది. ఈ క్రమంలో సింగ్‌ బలవన్మరణానికి పాల్పడటం బాధాకరం. చనిపోయే ముందు ప్రతాప్‌ సింగ్‌ తన కుమార్తెలకు 200 బహ్రెయినీ దినార్స్‌ ఇచ్చాడు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com