తెలంగాణ:మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం సిద్ధం
- February 15, 2019
తెలంగాణలో రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక సీఎం కేసీఆర్ తొలి సారి బడ్జెట్ ప్రవేశ పెట్టేందుకు రంగం సిద్ధం చేశారు. కేంద్రం పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టిన తర్వాతే రాష్ట్రం లో కూడా పూర్తి స్థాయి ప్రవేశ పెట్టాలని నిర్ణయించారు. దీంతో ఎన్నికల దృష్ట్యా ఓటాన్కౌంట్ బడ్జెట్ ను ప్రవేశ పెట్టేందుకు శ్రీకారం చుట్టారు. ఈ నెల 22 నుంచి మూడ్రోజుల పాటు సమావేశాలు నిర్వహించనున్నారు. 22 న ఉదయం 11.30 గంటలకు సభలో బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. 23నుంచి రెండు రోజుల పాటు చర్చ ఉంటుంది. 25న ద్రవ్య వియోగ బిల్లును సభ ఆమోదించడం తో సమావేశాలు ముగుస్తాయి.
బడ్జెట్ రూపకల్పనపై గురువారం ప్రగతి భవన్ లో సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ఇచ్చిన వాగ్ధానాలన్నీ నెరవేర్చేలా బడ్జెట్ రూపకల్పన ఉండాలని, పేదల సంక్షేమం కోసం, వ్యవసాయాభివృద్ధి కోసం అత్యధిక నిధులు కేటాయించేలా కూర్పు ఉండాలని అధికారులకు ఆదేశించారు. గత ఎన్నికల్లో ప్రజలకిచ్చిన వాగ్ధానాలను నెరవేర్చడానికి, ప్రస్తుతం అమల్లో ఉన్న పథకాల కొనసాగింపుకు అవసరమైన నిధులు కేటాయించేలా బడ్జెట్ రూపొందించాలని చెప్పారు. ప్రభుత్వ ప్రాధాన్యాలు, పథకాలు, వాటికయ్యే ఖర్చు తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు.
బడ్జెట్ రూపకల్పన, బడ్జెట్ ప్రసంగం ఆర్థిక మంత్రి సారధ్యం లో జరిగేది.అయితే ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు దాటినా..మంత్రి వర్గ విస్తరణ పూ ర్తవ్వలేదు. ఇప్పటి వరకు సీఎం కేసీఆర్ బడ్జెట్ రూపకల్పన సమావేశాలు నిర్వహిస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే సీఎం హోదాలో కేసీఆర్ బడ్జెట్ ని చదివే అవకాశాలు కనిపిస్తున్నాయి. హోమ్ మంత్రి మహమూద్ అలి ఎమ్మెల్సీ కాబట్టి అదే సమయం లో శాసన మండలిలో ప్రవేశ పెడతారు. దీంతో సీఎం ఇక బడ్జెట్ ప్రసంగించడం తప్పనిసరి.
మరోవైపు trs పార్టీ లో క్యాబినెట్ కి ముహూర్తం సిద్దమైనట్లు చర్చ జరుగుతోంది. 22న అసెంబ్లీ సమావేశాలు షెడ్యూల్ విడుదల కావడం తో ఇక వచ్చే రెండు రోజుల్లో విస్తరణ ఖాయం అనే సంకేతాలు కనిపిస్తున్నాయి.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..