'నరకాసురుడు'ఫస్ట్ లుక్!
- February 15, 2019
తెలుగు, తమిళ ఇండస్ట్రీలో ఒకప్పుడు మణిరత్నం తెరకెక్కించిన 'రోజా'చిత్రంలో హీరోగా నటించిన అరవింద్ స్వామి మంచి అందగాడిగా పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత మణిరత్నం,అరవింద్ స్వామి కాంబినేషన్ లో ముంబాయి చిత్రం కూడా మంచి విజయం అందుకుంది. హీరోగా మంచి ఫామ్ లో ఉండగానే ఇండస్ట్రీకి దూరమయ్యాడు అరవింద్ స్వామి. చాలా సంవత్సరాల తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. ఒకప్పుడు స్మార్ట్ హీరోగా పేరు తెచ్చుకున్న అరవింద్ ప్రస్తుతం విలన్ గా కూడా నటిస్తున్నారు.
ఆ మద్య రాంచరణ్ నటించిన ధృవ్ చిత్రంలో విలన్ గా కనిపించాడు. తాజాగా కార్తీక్ నరేన్ దర్శకత్వంలో రమేష్ వర్మ పెన్మెత్స ప్రొడక్షన్‌లో, కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్న చిత్రం 'నరకాసురుడు'. ఈ చిత్రంలో అరవింద్ స్వామి, శ్రియ, సందీప్ కిషన్ ముఖ్యపాత్రల్లో కనిపిస్తున్నారు. 'నరకాసురుడు' 'ది టేల్ ఆఫ్ ఎ ఫాలెన్ డెమాన్'.. అనేది ట్యాగ్ లైన్.. ఈ ఫస్ట్‌లుక్‌లో అరవింద్ స్వామి ఎక్స్‌ప్రెషన్ బాధగా, శ్రియ రియాక్షన్ కోపంగా చూస్తున్నట్టు ఉంది.
క్రైమ్ థ్రిల్లర్ గా ఈ చిత్రం ఉండబోతున్నట్లు సమాచారం. వాస్తవానికి నరకాసురుడు గతేడాది మే లోనే రిలీజ్ కావాల్సి ఉండగా, పలుమార్లు వాయిదా పడుతూ వస్తుంది. 'నేలకొరిగిన ఓ రాక్షసుడి కథ అనే క్యాప్షన్ ఇంట్రెస్టింగ్‌గా ఉంది.. ఈ సమ్మర్‌లో, తెలుగు, తమిళ్‌లో నరకాసురుడు రిలీజ్ కానుంది
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!