రూ.1 లక్ష పెట్టుబడి పెడితే నెలకు రూ.14 వేలు.. కేంద్ర ప్రభుత్వ ముద్ర పథకం.

- February 15, 2019 , by Maagulf
రూ.1 లక్ష పెట్టుబడి పెడితే నెలకు రూ.14 వేలు.. కేంద్ర ప్రభుత్వ ముద్ర పథకం.

అందరికీ ఉద్యోగం చేసే అవకాశం ఉండదు. ఖాళీగా కూర్చునే బదులు ఏదైనా వ్యాపారం ప్రారంభించొచ్చుగా అనే వాళ్లకు ఎలా సమాధానం చెప్పాలో అర్థం కాదు. వ్యాపారం ప్రారంభించాలంటే ఎంతో కొంత పెట్టుబడి పెట్టాలి. అంత డబ్బు ఎక్కడినుంచి తేవాలి అన్న ఆలోచన. పెట్టిన పెట్టుబడి అయినా వస్తుందో లేదో అన్న భయం. ఈ భయాలన్నీ నివారిస్తూ మేమున్నామని భరోసా ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం ముద్ర పథకం ద్వారా. ఇందుకోసం మనదగ్గర లక్ష రూపాయలు ఉంటే చాలు. సొంతంగా వ్యాపారం మొదలు పెట్టొచ్చు. అది ఎలాగో తెలుసుకుందాం..
ముద్ర స్కీమ్‌లోని ఓ ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రకారం మెటల్ ప్రొడక్ట్స్ ఉత్పత్తి చేసే యూనిట్ ఏర్పాటు చేసుకోవచ్చు. అందుకు సంబంధించిన పనిముట్లను, పరికరాలను తయారు చేయాల్సి ఉంటుంది. మీరు తయారు చేసిన వస్తువుల్ని మార్కెట్ చేయగలిగితే భారీ స్థాయిలో వ్యాపారాన్ని విస్తరించుకోవచ్చు. ఈ వ్యాపారం కోసం రూ.3.30 లక్షలు అవసరమవుతాయి. దీని కోసం మీరు రూ.1 లక్ష పెట్టుబడి పెడితే మిగతా మొత్తాన్ని బ్యాంకు నుంచి తీసుకోవచ్చు. 
యూనిట్ ఏర్పాటు చేయడానికి రూ.1.80 లక్షలకు ఖర్చవుతుంది. ఇందులో మెషనరీ, వెల్డింగ్ సెట్, బఫింగ్ మోటార్, డ్రిల్లింగ్ మెషీన్, బెంచ్ గ్రైండర్, హ్యాండ్ డ్రిల్లింగ్, హ్యాండ్ గ్రైండర్, బెంచ్, ప్యానెల్ బోర్డ్, ఇతర పరికరాలు వస్తాయి. 
రా మెటీరియల్‌కు రూ.1.20 లక్షలు ఖర్చవుతుంది. రెండు నెలలకు సరిపడా రా మెటీరియల్ వస్తుంది. వాటితో ప్రతి నెల రూ.40 వేల విలువైన సామాగ్రి, రూ.20 వేల విలువైన వ్యవసాయ పనిముట్లు తయారు చేయవచ్చు.
జీతభత్యాలు, ఇతర ఖర్చులు నెలకు రూ.30 వేలు. మొత్తం ఖర్చు రూ.3.30 లక్షలు.
లాభం ఎలా..
ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రకారం సేల్స్ టర్నోవర్ నెలకు రూ. 1.10 లక్షలు ఉంటుందని అంచనా. ఉత్పత్తి ఖర్చు రూ.91,833 అవుతుంది. అంటే లాభం రూ.18,167. తీసుకున్న లోన్‌పై 13% బ్యాంకు వడ్డీ రూ.2,340. ప్రోత్సాహకం 1% ఇస్తే రూ.1,100 కలిసి వస్తుంది. ఈ లెక్కన నెలకు రూ.14,427 లాభం వస్తుంది. 
ముద్ర స్కీమ్‌కు ఎలా అప్లై చేయాలి..
మీరు ఏ బ్యాంకులో అయినా ప్రధాన మంత్రి ముద్ర యోజన కింద లోన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. మీ పేరు, అడ్రస్, చేయాలనుకునే వ్యాపారం, విద్యార్హతలు, ప్రస్తుత ఆదాయం, రుణం ఎంత కావాలి అన్న వివరాలు వెల్లడించాలి. లోన్ కోసం ఎలాంటి గ్యారెంటీ, ప్రాసెసింగ్ ఫీజు అవసరం లేదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com