సౌదీ రాజు సల్మాన్ పాకిస్తాన్ పర్యటన ఆలస్యం...

- February 16, 2019 , by Maagulf
సౌదీ రాజు సల్మాన్ పాకిస్తాన్ పర్యటన ఆలస్యం...

సౌదీ అరేబియా: సౌదీ రాజు ముహమ్మద్ బిన్ సల్మాన్ పాకిస్థాన్ దేశ పర్యటన ఆలస్యం కానుంది. పాకిస్థాన్ దేశంలో రెండురోజుల పర్యటన కోసం సౌదీ రాజు సల్మాన్ ఈ నెల 16న ఇస్లామాబాద్ రావాల్సి ఉండగా, అర్థాంతరంగా ఒకరోజు వాయిదా పడింది. సౌదీ రాజు పాక్ పర్యటన ఒకరోజు ఎందుకు ఆలస్యమైందనే విషయం వెల్లడి కాలేదు. భారతదేశంలోని పుల్వామాలో ఉగ్రవాదులు చేసిన దాడి ఘటనను సౌదీ అరేబియా రాజు సల్మాన్ ఖండించారు. ఈ దాడి ఘటనపై స్పందించిన రాజు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తాము భారతదేశానికి మద్ధతు ఇస్తామని ప్రకటించారు. క్షతగాత్రులైన భారత జవాన్లు త్వరగా కోలుకోవాలని సౌదీ రాజు ఆశాభావం వ్యక్తం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com