మస్కట్‌ ఇండియన్‌ ఎంబసీ వద్ద ప్రత్యేక ప్రార్థనలు

- February 16, 2019 , by Maagulf
మస్కట్‌ ఇండియన్‌ ఎంబసీ వద్ద ప్రత్యేక ప్రార్థనలు

మస్కట్‌:ఒమన్‌లోని ఇండియన్‌ ఎంబసీ వద్ద ప్రత్యేక ప్రార్థనల్ని ఏర్పాటు చేస్తున్నారు. కాశ్మీర్‌లో తీవ్రవాదుల దాడి కారణంగా ప్రాణాలు కోల్పోయిన 42 మంది జవాన్లకు ఈ సందర్భంగా ఘన నివాళి అర్పించనున్నారు. ఇండియన్‌ ఎంబసీ సీనియర్‌ అధికారి మాట్లాడుతూ, పుల్వామా టెర్రర్‌ ఎటాక్‌ మృతులకు శ్రద్ధాంజలి ఘటించేందుకోసం ప్రేయర్‌ మీటింగ్‌ ఏర్పాటు చేశామనీ, ఆదివారం అంటే ఫిబ్రవరి 17న ఉదయం 11.30 నిమిషాలకు ఈ కార్యక్రమం జరుగుతుందని అన్నారు. ఎంబసీ ఆడిటోరియంలో జరగనున్న ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు ఎంబసీ అధికారులు. కాగా, ఒమన్‌ మినిస్ట్రీ ఆఫ్‌ ఫారిన్‌ ఎఫైర్స్‌, ఈ తీవ్రవాద దాడిని ఖండిస్తూ భారత ప్రభుత్వానికి సంతాప ప్రకటన పంపిన సంగతి తెల్సిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com