'అంజలి సిబిఐ' ఆడియో విడుదల
- February 17, 2019
నయనతార టైటిల్ పాత్రలో ఆర్. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో రూపొందిన క్రైమ్ థ్రిల్లర్ 'ఇమైక్కా నొడిగల్'. ఈ చిత్రాన్ని సి.జె. జయకుమార్ సమర్పణలో విశ్వశాంతి పిక్చర్స్ బ్యానర్‌పై సి.హెచ్.రాంబాబు, ఆచంట గోపీనాథ్ తెలుగులో 'అంజలి సిబిఐ' పేరుతో ఫిబ్రవరి 22న విడుదల చేస్తున్నారు. హిప్ హాప్ తమిజా సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం శనివారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగింది. ఆడియో సీడీలను 'గృహం' ఫేమ్ మిలింద్ రావ్ విడుదల చేయగా, తొలి సీడీని తుమ్మల ప్రసన్నకుమార్ అందుకున్నారు.
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు ఆర్. అజయ్ జ్ఞానముత్తు మాట్లాడుతూ.. ''తమిళంలో ఈ సినిమాను తెరకెక్కించడానికి 2 సంవత్సరాల సమయం పట్టింది. అయితే సినిమా రిలీజ్ తర్వాత ఆ కష్టమంతా మరచిపోయేలా పెద్ద హిట్ అయింది. గోపీనాథ్‌గారు ఈ సినిమా కోసం నన్ను ఎప్పటి నుండో అడుగుతున్నారు. తమిళంలో సినిమా చూసి అభినందించిన ఆయనే తెలుగులో హక్కులు కొని విడుదల చేయడం ఆనందంగా ఉంది. శ్రీరామకృష్ణగారు అద్భుతంగా సినిమాను తెలుగులో చక్కగా రాశారు. తమిళంలో ఘన విజయం సాధించిన తీరుగానే తెలుగులో కూడా ఈ సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను..'' అన్నారు.
రైటర్ శ్రీరామకృష్ణ మాట్లాడుతూ.. ''గోపీనాథ్గారితో ఎప్పటి నుండో నాకు పరిచయం ఉంది. ఆయన సీనియర్ ప్రొడ్యూసర్. సినిమా గురించి మాట్లాడాలంటే చూసే ప్రేక్షకులను ఎగ్జయిట్ చేసే చిత్రమిది. ప్రతి ఒక్కరూ ఎంగేజ్ అవుతారు. హృదయాన్ని స్పందింప చేసే కథతో పాటు అద్భుతమైన స్క్ర్రీన్ప్లేను రాశాడు దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు. నయనతార చేసిన లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో 50 కోట్లకుపైగా వసూలు చేసి ఆమె కెరీర్‌కు పెద్ద టర్నింగ్ పాయింట్లా ఈ చిత్రం నిలిచింది. ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్ సీన్స్, సెంటిమెంట్, లవ్, ప్రతీకారం ఇలా అన్నీ ఎలిమెంట్స్ చక్కగా కుదిరాయి. బాషా అనువాదం చిత్రంతో తెలుగులో రజనీకాంత్‌గారికి పెద్ద బ్రేక్ దొరికింది. ఆ సినిమాను విశ్వశాంతి పిక్చర్స్ సంస్థనే తెలుగులో విడుదల చేసింది. మళ్లీ ఇన్నేళ్లకు అంజలి సిబిఐ చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సంస్థ చాలా మంచి చిత్రాలు చేయాలని కోరుకుంటూ గోపీనాథ్గారికి, రాంబాబుగారికి అభినందనలు'' అన్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..