హెచ్చరిక: అత్యధిక నేరాలు ఆన్లైన్లోనే
- February 19, 2019
దుబాయ్‌లో 95 శాతం వరకు నేరాలు ఆన్లైన్లోనే జరుగుతాయని పోలీస్ ఉన్నతాధికారి ఒకరు హెచ్చరిస్తున్నారు. దుబాయ్ పోలీస్ - ఫ్యూచర్ ఫోర్‌సైట్ సెంటర్ డైరెక్టర్ బ్రిగేడియర్ అబ్దుల్లా అబ్దుల్ రహ్మాన్ బిన్ సుల్తాన్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఆన్లైన్ గేమింగ్ ప్రమాదాలపైనా ఆయన హెచ్చరికలు జారీ చేశారు. ఆన్లైన్ గేమింగ్స్ పిల్లల భవిష్యత్తుపై పెను ప్రమాదం చూపుతాయని హెచ్చరించారాయన. రానున్న 10 ఏళ్ళలో సెక్యూరిటీ ఛాలెంజెస్ అనే అంశంపై జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ బ్రిగేడియర్ అబ్దుల్లా అబ్దుల్ రహ్మాన్ బిన్ సుల్తాన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజల్లో అవగాహన పెంచడం ద్వారా ఆన్లైన్ నేరాలకు అడ్డుకట్ట వేయవచ్చుననీ, ప్రైవసీ విషయంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ఆయన అన్నారు. కాగా, సెక్యూరిటీ అవేర్నెస్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ బట్టి అల్ ఫలాసి, ఎమిరేట్ సెక్యూరిటీ - ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అనే ప్రాజెక్ట్‌ని ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా దుబాయ్ పోలీస్‌కి సంబంధించిన అన్ని ఇ-సిస్టమ్స్నీ లింక్ చేయవచ్చు. తద్వారా కొత్త సవాళ్ళపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వ్యవహరించడానికి వీలవుతుంది.
తాజా వార్తలు
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...