భారతదేశంలో సౌదీ క్రౌన్‌ ప్రిన్స్‌ పర్యటన

- February 20, 2019 , by Maagulf
భారతదేశంలో సౌదీ క్రౌన్‌ ప్రిన్స్‌ పర్యటన

సౌదీ క్రౌన్‌ ప్రిన్‌స మొహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ భారతదేశం చేరుకున్నారు. పాకిస్తాన్‌ పర్యటనను ముగించుకుని భారత్‌కి చేరుకున్న సౌదీ క్రౌన్స్‌ ప్రిన్స్‌కి భారత ప్రభుత్వం స్వాగతం పలికింది. ఎయిర్‌పోర్ట్‌లో భారత ప్రధాని నరేంద్ర మోడీ, సౌదీ క్రౌన్‌ ప్రిన్స్‌ని కలిశారు. భారత్‌ - పాక్‌ మధ్య నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల నడుమ సౌదీ క్రౌన్‌ ప్రిన్స్‌ పాక్‌ పర్యటన ముగించుకుని, భారత్‌కి రావడం పట్ల సర్వత్రా ఆసక్తి నెలకొంది. భారత్‌ - సౌదీ అరేబియా మధ్య సంబంధాలు, అలాగే ప్రపంచానికి పెను ముప్పుగా మారిన తీవ్రవాదాన్ని అంతమొందించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి అంశాలపై సౌదీ క్రౌన్‌ ప్రిన్స్‌ భారత పరట్యనలో చర్చలు జరిగే అవకాశం వుంది. సౌదీ అరేబియాలో పనిచేస్తున్న భారతీయుల భద్రతకు సంబంధించి సైతం మోడీ - క్రౌన్‌ ప్రిన్స్‌ మధ్య చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది సౌదీ - భారత్‌ మధ్య 27.5 బిలియన్‌ డాలర్ల వాణిజ్యం జరిగింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com