ఫేక్ కిడ్నాప్: 100 బహ్రెయినీ దినార్స్ జరీమానా
- February 20, 2019
ఫేక్ కిడ్నాప్ కేసు ద్వారా మాజీ బాయ్‌ఫ్రెండ్ బంధువుల్ని ఇరికించాలనుకున్న మహిళకు న్యాయస్థానం 100 బహ్రెయినీ దినార్స్ జరీమానా విధించింది. అంతకు ముందు ఆమెకు జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. అయితే నిందితురాలి అభ్యర్థన మేరకు జైలు శిక్షను రద్దు చేసి జరీమానా ఖరారు చేయడం జరిగింది. మాజీ బాయ్‌ఫ్రెండ్ సోదరుడు మరియు అతని భార్యతో గొడవలు జరుగుతున్నాయనీ ఈ క్రమంలోనే నిందితురాలు వారిని ట్రాప్ చేసేందుకు ప్రయత్నించిందని విచారణలో తేలింది. మాస్క్ వేసుకున్న వ్యక్తులు తనను కిడ్నాప్ చేసి రిఫ్ఫాలోని బుహైర్ ప్రాంతానికి తరలించినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది నిందితురాలు. అయితే విచారణలో నిందితురాలు చెప్పినవన్నీ అబద్ధాలేనని పోలీసులు తేల్చారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..