అమెరికా:39 రాష్ట్రాల్లో తీవ్రంగా కురుస్తోన్న మంచు
- February 20, 2019
అమెరికా తూర్పు ప్రాంతంలోని 39 రాష్ట్రాల్లో మంచు తీవ్రంగా కురుస్తోంది. డెట్రాయిట్, చికాగో, ఫిలడెల్ఫియా, న్యూయార్క్, వాషింగ్టన్ రాష్ట్రాల్లో గత రాత్రి భారీగా మంచుకురిసినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో చాలా పట్టణాల్లో పాఠశాలలు, కార్యాలయాలు మూతపడ్డాయి. వాషింగ్టన్ లో 7వందలవిమానాలు, చికాగోలో 2వందలు రద్దైనట్లు అధికారులు తెలిపారు. ఫిలడెల్ఫియాతోపాటు మధ్య రాష్ట్రాల్లోని విమానాశ్రయాల్లోను విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడినట్లు వెల్లడించారు. మిన్నెపోలీస్, వాషింగ్టన్, ఫిలడెల్ఫియాలో అధికారులు ముందు జాగ్రత్తగా వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. మంచు కారణంగా దాదాపు 2 మిలియన్ల మంది ప్రజలు తీవ్ర ఇబ్బందుకు గురవుతున్నారని తెలిపారు. జనం ఇళ్లలోంచి బయటకు వచ్చేందుకే జంకుతున్నారు. మరికొద్దిరోజుల పాటు వాతావరణం ఇలానే ఉండే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..