తెలంగాణ:అమర జవాన్ల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం
- February 22, 2019
హైదరాబాద్ః తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు కాసేపటి క్రితమే ప్రారంభమయ్యాయి. పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు సంతాపం తెలుపుతూ సీఎం కేసీఆర్ తీర్మానం ప్రవేశపెట్టారు. జవాన్ల ప్రాణాలు పోకుండా కేంద్రం పటిష్టమైన విధానం తీసుకోవాలని సీఎం కేసీఆర్ తెలిపారు. జవాన్ల కుటుంబాలకు అండగా ఉంటామని అన్నారు. జవాన్ల కుటుంబాలకు ప్రభుత్వం తరుపున ఆర్థిక సహాయం ప్రకటించారు. అమరులైన ఒక్కో జవాను కుటుంబానికి రూ.25 లక్షలు ఇవ్వనున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. జవాన్లకు నివాళి అనంతరం జీఎస్టీ చట్టానికి తీసుకువచ్చిన సవరణ బిల్లును ప్రతిపాదించనున్నారు. శాసనసభ ప్రారంభం కంటే ముందు బడ్జెట్ పత్రాలను శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కలిసి స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి అందజేశారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..