ఏఎంబీ సినిమాస్‌లో మహేష్ మైనపు విగ్రహం...
- February 22, 2019
సింగపూర్‌లోని ప్రతిష్ఠాత్మక మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో మహేష్ మైనపు విగ్రహాన్నిఉంచనున్నట్టు ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.అయితే అంతకముందు మహేష్‌కు చెందిన ఏఎంబీ థియేటర్‌లో ఈ విగ్రహాన్నిఉంచనున్నారు.మార్చి 25న వ్యాక్స్ విగ్రహాన్ని మహేష్ లాంచ్ చేయనున్నారు.ఒక్క రోజు మాత్రమే ఈ విగ్రహం ఏఎంబీ సినిమాలో ఉంటుందని సమాచారం. వ్యాక్స్ స్టాచ్యూ లాంచింగ్ ఈవెంట్‌ని ఘనంగా జరపాలని థియేటర్ యాజమాన్యం భావిస్తుందట. అయితే ఆ మధ్య మహేష్ మైనపు విగ్రహం ఎలా ఉంటుందో చిన్న నమూనాతో చూపించారు శిల్పి ఇవాన్ రీస్. ఇందులో మహేష్ హెయిర్ స్టైల్ సరికొత్తగా ఉండగా, ఇది అభిమానులని ఆకట్టుకుంది. ప్రస్తుతం మహేష్ బాబు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మహర్షి సినిమాతో బిజీగా ఉన్నాడు. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో అల్లరి నరేష్ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. ఏప్రిల్ 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్‌లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం







