రక్తదానంపై అవగాహన పెరగాలి

- December 28, 2015 , by Maagulf
రక్తదానంపై అవగాహన పెరగాలి


రక్తదానంపై అవగాహన పెరగాల్సి ఉందని, ఓ వ్యక్తి 400 మిల్లీ లీటర్ల రక్తాన్ని దానం చేస్తే, అది ఆపద సమయంలో ఉన్న ముగ్గురికి ఉపయోగపడ్తుందని వైద్యులు వెల్లడించారు. ఒమన్‌లో పెరుగుతున్న రోడ్‌ యాక్సిడెంట్స్‌ వలన అత్యవసరంగా రక్తం అవసరమవుతోందనీ, బాధితులకు రక్తం అందించడంలో రక్త నిధి కేంద్రాలు ఒక్కోసారి రక్తం కొరతను ఎదుర్కొంటున్నాయని సలాహ్‌ లైఫ్‌లైన్‌ హాస్పిటల్‌ 'ఆపరేషన్స్‌ డైరెక్టర్‌' డాక్టర్‌ ఆసిఫ్‌ గని చెప్పారు. మెడికల్‌ డైరెక్టర్‌ షాహిద్‌ యూసఫ్‌ మాట్లాడుతూ, రక్తదానంపై అవగాహన పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఆయన మాట్లాడుతూ, రక్త దానం ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా సేఫ్‌ అనీ, తద్వారా శరీరంలోని కొలెస్టరాల్‌ లెవల్స్‌ని తగ్గించుకోవడానికి వీలవుతుందని చెప్పారు. ఓసారి రక్తదానం చేశాక చాలా తక్కువ సమయంలోనే ఆ రక్తం రికవరీ చేయబడ్తుందనీ, ఈ క్రమంలోనే బోన్‌ మ్యారో కూడా ఇంకా సమర్థవంతంగా పనిచేస్తుందని వివరించారు. ఎన్‌జివోలు, స్వచ్ఛంద సంస్థలు రక్త దానంపై చేపడ్తున్న అవగాహనా కార్యక్రమాల్ని మరింత ఉధృతంగా చేపట్టవలసి ఉందని డాక్టర్‌ ఆసిఫ్‌ చెప్పారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com