భారతీయ కార్మికుడ్ని వరించిన అదృష్టం
- February 25, 2019
భారతీయ కార్మికుడొకర్ని అదృష్టం వరించింది. తన మొబైల్ ఫోన్‌ని రెన్యూ చేసుకోవడంతో ఊహించని అదృష్టం ఆయన సొంతమయ్యింది. వివరాల్లోకి వెళితే బల్వీర్ సింగ్ అనే వ్యక్తి, తన మొబైల్ నెంబర్ రిజిస్ట్రేషన్‌ని రెన్యువల్ చేయించుకోగా, 570 ఎస్ స్పైడర్ కారు అతనికి బహుమతిగా లభించింది. తన జీవితంలో తానెప్పుడూ ఊహించనంత గొప్ప బహుమతి ఇప్పుడు తనకు లభించిందని ఆయన అంటున్నారు. ఎమిరేట్స్ ఇంటిగ్రేటెడ్ టెలీ కమ్యూనికేషన్స్ కంపెనీ (ఈఐటిసి) డ్యు, యూఏఈ రిజిస్ట్రేషన్ పాలసీ నేపథ్యంలో ఈ బహుమతిని అతనికి అందజేసింది. గడువు తీరిన ఐడీ రిజిస్ట్రేషన్స్‌ని కొత్తగా రెన్యూ చేసుకుంటే, సర్వీస్ కటాఫ్ నుంచి వెసులుబాటు కల్పిస్తామని చెబుతూ, ఇందుకు జనవరి 31వ తేదీని డెడ్‌లైన్‌గా ప్రకటించారు. అలా రెన్యూ చేయించుకున్నవారిని బంపర్ డ్రాలో పాల్గొనేందుకు అర్హత కల్పించారు. బల్వీర్‌కి శుభాకాంక్షలు తెలుపుతున్నామని సంస్థ డిప్యూటీ సీఈఓ ఫహాద్ అల్ హస్సావి చెప్పారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..