1 జిబి డేటా కేవలం 1 దిర్హామ్‌కే

- February 26, 2019 , by Maagulf
1 జిబి డేటా కేవలం 1 దిర్హామ్‌కే

యూఏలో ఎటిసలాట్‌ సంస్థ తమ వినియోగదారులకు బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. 1 జీబీ డేటాని ఫుల్‌ స్పీడ్‌తో కేవలం 1 దిర్హామ్‌కే అందిస్తున్నట్లు వెల్లడించింది. ప్రతి 24 గంటలకు ఈ డేటా ప్లాన్‌ రెన్యువల్‌ అవుతుంది. ప్రీపెయిడ్‌ యూజర్లకు మాత్రమే ఈ ఆఫర్‌ వర్తిస్తుందని సంస్థ పేర్కొంది. అది కూడా లిమిటెడ్‌ పీరియడ్‌ మాత్రమే. మై ఎటిసలాట్‌ యూఏఈ యాప్‌ లేదా సంస్థకు సంబంధించిన ప్రత్యేక నెంబర్లను సంప్రదించి వినియోగదారులు ఈ ప్యాక్స్‌ని సబ్‌స్క్రైబ్‌ చేసుకోవచ్చు. వినియోగదారులు ఎప్పుడైనా తమ సబ్‌స్క్రిప్షన్‌ని రద్దు చేసుకునే అవకాశం కూడా కల్పిస్తున్నారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com