పాకిస్తాన్: భారత్ దాడులకు తగిన విధంగా సమాధానం చెప్తాం
- February 26, 2019
ఇస్లామాబాద్: పాక్ ఉగ్రదాడి శిబిరాలపై భారత వాయుసేన దాడి చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ దాడిపై పాకిస్థాన్ విదేశాంగా మంత్రి షా మహమూద్ ఖురేషీ ఘాటుగా స్పందించారు. ఇండియా మరీ దూకుడుగా వ్యవహరించింది అని ఆయన అన్నారు. కాగా భారత్ ఇది నియంత్రణ రేఖను ఉల్లంఘించడమే అవుతుంది. పాకిస్థాన్‌కు ఆత్మరక్షణ చేసుకునే హక్కు ఉంది. మేము కూడా దీటుగానే స్పందిస్తాం అని ఖురేషీ హెచ్చరించారు. పాకిస్థాన్ తెహ్రీకె ఇన్సాఫ్ (పీటీఐ) ఆయన ప్రకటనను ట్విటర్లో పోస్ట్ చేసింది. పాకిస్థాన్‌తో పెట్టుకోవద్దు.. ఇండియా ఎలాంటి దుస్సాహసం చేసినా అందుకు తగినట్లు స్పందిస్తాం అని ఇండియాను ఖురేషీ హెచ్చరించారంటూ పీటీఐ మరో ట్వీట్ చేసింది. ఈ ప్రాంతంలో శాంతియుత వాతావరణాన్ని ఇండియా చెడగొడుతున్నదని ఖురేషీ ఆరోపించడం గమనార్హం. ఈ దాడుల తర్వాత ఖురేషీ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..