అబుధాబి కి సుష్మ స్వరాజ్ వస్తే మేము రాము అంటున్న పాక్
- February 28, 2019
దుబాయ్: వచ్చే నెలలో ఇస్లామిక్ సహకార సంస్థ (ఐవోసీ) సమావేశానికి భారత్ విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ హాజరైన పక్షంలో తాము ఈ సదస్సును బహిష్కరిస్తామని పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి షా మహ్మద్ ఖురేషీ ప్రకటించారు. ఈ సమావేశానికి సుష్మా స్వరాజ్‌ను గౌరవ అతిథిగా ఆహ్వానించారు. ఈ సమావేశం మార్చి 1,2 తేదీల్లో అబూదాబీలో జరుగుతుంది. తమకు ఇస్లామిక్ దేశం, లేదా ఐవోసీలో విబేధాలు లేవని ఖురేషీ చెప్పారు. కాని ఈ సమావేశానికి సుష్మాస్వరాజ్ హాజరు కావడాన్ని నిరసిస్తున్నట్లు చెప్పారు. ఈ విషయాన్ని ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గెటెరస్, టర్కీ విదేశాంగ శాఖ మంత్రి మేవ్లుట్ కేవ్సోగ్లుకు తెలియచేసినట్లు చెప్పారు. ఈ సమావేశానికి సుష్మా స్వరాజ్ ఎందుకు హాజరవుతున్నారో తెలియడం లేదన్నారు. ఈ విషయమై యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రతినిధికి తెలియచేసినట్లు ఆయన చెప్పారు. కాగా పాకిస్తాన్, ఇండియా సంయమనంతో ఉండాలని ఓఐసీ ఇప్పటికే విజ్ఞప్తి చేసింది. ఇరుదేశాలు జవాబుదారీతనంతో వ్యవహరించాలని కోరింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..